Andhra Pradesh

News June 19, 2024

YS రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలి: TNSF

image

యూనివర్సిటీలలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని TNSF నేతలు తప్పుబట్టారు. ఇందులో భాగంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, కడప జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేశ్ YVU వీసీ ప్రొఫెసర్ చింత సుధాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిబంధనలకు విరుద్ధంగా యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు.

News June 19, 2024

తూ.గో: ఉపాధి హామీ పనికి వెళ్లి వ్యక్తి మృతి

image

గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన కరణం వెంకటేశులు(50) బుధవారం ఉపాధి హామీ పనికి వెళ్లి మృతిచెందారు. పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో తోటి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే వెంకటేశులు మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ దుర్గారావు వెల్లడించారు.

News June 19, 2024

తాడికొండ MLA పేరుతో నకిలీ FB అకౌంట్

image

తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ తయారయింది. ఈ మేరకు శ్రావణ్ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు “Tenali Srawan Kumar” అనే పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించారని చెప్పారు. ఆ అకౌంట్ నుంచి మెసేజ్ చేసి డబ్బులు అడుగుతున్నారని, ఎవరూ స్పందించవద్దని అన్నారు. ఇలాంటివి గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

News June 19, 2024

విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: పల్లా శ్రీనివాసరావు

image

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. గాజువాక శ్రీనగర్‌లో ఓ ప్రైవేట్ కళాశాలలో డ్రగ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను ఆయన వివరించారు. వీటిని పూర్తిగా నిర్మూలించడంపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మేకా సత్తిబాబు పాల్గొన్నారు.

News June 19, 2024

గుంటూరు: విద్యుత్ షాక్‌కి గురై మహిళ మృతి

image

విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటనపై అరండల్ పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమీనగర్‌లో నివాసం ఉండే లూర్దు మేరి(47) నీటి మోటారుకు పైపు అమరుస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. గమనించి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 19, 2024

శ్రీకాకుళం యువతకు గుడ్‌న్యూస్

image

శ్రీకాకుళం పట్టణంలోని నెహ్రూ యువ కేంద్రంలో శుక్రవారం జూన్ 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ బుధవారం తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన యువత వివిధ కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు ఉదయం 10 గంటలలోగా హాజరు కావాలని ఆమె కోరారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో రావాలన్నారు. WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

News June 19, 2024

పాత మాగులూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

పాత మాగులూరుకు చెందిన చల్లా సాయిరాం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగి మంగళవారం స్వగ్రామం వస్తుండగా త్రిపురాంతకం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వీరి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని నరసరావుపేట హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ సాయిరాం బుధవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News June 19, 2024

ఆదాల నయవంచకుడు: వైవీ

image

నెల్లూరుకు చెందిన వైసీపీ నేత వైవీ రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ద మనిషి అనే ముసుగు వేసుకున్న నయవంచకుడు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. రూ.2 కోట్ల ఖర్చు పెట్టి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయించాడు. కోటంరెడ్డి మంచి నాయకుడు. నాకు 40 ఏళ్లుగా స్నేహితుడు. ప్రజల సమస్యలు తీర్చే అసలైన నాయకుడు ఆయనే’ అని వైవీ రామిరెడ్డి అన్నారు.

News June 19, 2024

మాజీ మంత్రి రోజాపై బుద్ధా వెంకన్న ఫైర్

image

రుషి కొండలోని పర్యాటక స్థలంలో పర్యాటన భవనాలు నిర్మించడం తప్పా అంటూ Xలో మాజీ మంత్రి రోజా చేసిన పోస్టుకు మాజీ MLC TDP నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషి కొండపై కట్టిన నిర్మాణాలు నాడేమో CM ఉండడానికని చెప్పిన రోజా ఇప్పుడేమో పర్యాటకుల కోసం నిర్మించామని చెబుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి రోజాపై ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటో బయటికి వస్తాయని అన్నారు.

News June 19, 2024

అశోక్ గజపతిరాజుతో రామ్మోహన్ నాయుడు భేటీ

image

కేంద్ర మాజీమంత్రి పి.అశోక్ గజపతి రాజును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఉన్న అశోక్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మంచి మంత్రిత్వ శాఖ ఇచ్చారని బాగా పనిచేసి పేరు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడును కోరారు. విమానయాన రంగంపై అశోక్ తన అనుభవాలను వివరించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా అశోక్‌ను కలిశారు.