India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుచ్చి(M) పెనుబల్లికి చెందిన గిరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి మైథిలీప్రియ (23) బీఫార్మసీ పూర్తి చేసింది. ఆ సమయంలో సహ విద్యార్థి నిఖిల్‌ను ప్రేమించింది. కొన్నాళ్లుగా నిఖిల్ మరో యువతితో సన్నిహితంగా ఉండటంపై మైథిలీప్రియ గొడవ పడుతోంది. ఈక్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచి నిఖిల్ <<17695710>>కత్తితో పొడిచి హత్య<<>> చేశాడు. అనంతరం దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
మచిలీపట్నంలో ఆదివారం చికెన్, మటన్ ధరలు ఇలా ఉన్నాయి. పట్టణంలో చికెన్ విత్ స్కిన్ కిలో రూ.220, స్కిన్‌లెస్ కిలో రూ.240కు విక్రయాలు జరుగుతున్నాయి. అదే ధరలు గ్రామాల్లో ఎక్కువగా ఉండి స్కిన్ ఉన్న చికెన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. మటన్ కిలో రూ.1000గా ఉండగా, గ్రామాల్లో మాత్రం కిలో రూ.800కి విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లా నూతన SPగా హర్షవర్ధన్ రాజు నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతి SPగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. TTD CVSOగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి SPగా విధుల సమయంలో రాత్రి వేళ నైట్ విజన్ డ్రోన్లు రంగంలోకి దించి గంజా బ్యాచ్ అంతు చేశారు. తిరుపతి హోమ్ స్టేల కోసం నూతన యాప్ ప్రవేశపెట్టి తన మార్క్ చూపించారు. ఈయన తిరుపతికి ముందు కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు.
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ఉత్పత్తులను కలెక్టర్ సిరి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి ఎగుమతుల పరిస్థితి, కొనుగోలు ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉల్లి కొనుగోలు విషయంలో ఆలస్యం లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర తప్పనిసరిగా చెల్లించాలన్నారు.
గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10.30 గంటలకు డీపీఓలోని ఎస్పీ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన విజయనగరం నుంచి గుంటూరుకు బదిలీ అయ్యారు. ఎస్పీ బాధ్యతల స్వీకరణ కోసం పరిపాలనా సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
గుంటూరు జిల్లాలో శనివారం వర్షం దంచికొట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కురుస్తూనే ఉంది. వర్షంతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీయడంతో ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేశారు. పిడుగులు పడి పెదనందిపాడు మండలంలో ఇద్దరు, పెదకాకాని మండలంలో మరో ఇద్దరు మహిళా కూలీలు మృత్యువాత పడ్డారు. పలు చోట్ల అధిక వర్షం కారణంగా కాలువలు నిండి నీరు రోడ్లపైకి చేరింది.
ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటిస్తే వస్తువులు, నగదు పొగోట్టుకునే అవకాశం తక్కువుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే సామగ్రిని కాపాడుకోవచ్చు. ఇలాంటి చేదు అనుభవం శనివారం ఓ ప్రయాణికుడికి ఎదురైంది. శ్రీకాకుళంలోని టీసీబీకాలనీకి చెందిన ప్రణీత్ ఆర్టీసీ బస్సులో ఫోన్ మర్చిపోయి ఇంటికెళ్లి కాల్ చేశాడు. డ్రైవర్, కండక్టర్ వద్ద ఫోన్ సురక్షితంగా ఉందని తెలిసి సంతోషించాడు. అనంతరం బాధితుడికి మొబైల్ ఇచ్చారు.
కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి జాతర ఈ నెల 23 నుంచి 25 వరకు ఘనంగా జరగనుంది. అమ్మవారి చరిత్ర, తదితర విషయాలను వీడియో రూపంలో చూపేందుకు పోటీలు నిర్వహించనున్నట్లు DRO వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. వీడియో 3 నుంచి 5 నిమిషాల నిడివితో పాటు ఆకర్షణగా ఉండలాని చెప్పారు. 16 తేదీ లోపు dsdosrikakulam@apssdc.in కు వీడియోలను పంపాలని ఆయన పేర్కొన్నారు.
పెద్దపంజాణి మండలంలోని రాజుపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న 8 మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ ధనుంజయరెడ్డి తెలిపారు. రాజుపల్లి సమీపంలో పలువురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై దాడి చేశామన్నారు. అక్కడ 8 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.16,250 స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.