Andhra Pradesh

News June 19, 2024

గుంటూరు జిల్లాలో 2.4 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆరు మండలాల్లో స్వల్ప వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 2.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. కొల్లిపర మండలంలో 12.8, చేబ్రోలు 12, దుగ్గిరాల 9.8, మేడికొండూరు 6.8, గుంటూరు తూర్పు 0.8, గుంటూరు పశ్చిమ 0.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

News June 19, 2024

ప.గో.: పాముకు ప్రాణం పోశాడు

image

ప.గో. జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన సర్వేశ్వరరావు తన ఇంటి వద్ద అల్లిన ఫెన్సింగ్‌ వలలో ఓ తాచుపాము చిక్కుకుంది. ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్ పి.మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన కొవ్వూరు నుంచి రాయకుదురుకు వచ్చి వలలో చిక్కిన పామును రక్షించారు. అనంతరం దానికి నీటిని అందించాడు. సంచిలో బంధించి అడవిలో వదిలేశారు.

News June 19, 2024

మీ బెంజ్‌ కారు గురించి చెప్పండి: భాను

image

రుషికొండపై నిర్మాణాలను సమర్థిస్తూ రోజా <<13465987>>ట్వీట్ <<>>చేశారు. ఇందులోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉండటంపై రోజా విమర్శలు చేశారు. దీనికి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు’ అని భాను ట్వీట్ చేశారు.

News June 19, 2024

24 నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో భాగంగా ఈనెల 24 నుంచి సమస్యలపై వినతులు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

News June 19, 2024

కడప జిల్లాలో పలువురు సీఐలు ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 మంది ఎస్సైలు, నలుగురు సీఐలకు స్థానచలనం కల్పించారు. కడప 1 టౌన్ సీఐగా రామకృష్ణ, కాజీపేట సీఐగా ప్రొద్దుటూరు రూరల్ సీఐ రమణారెడ్డిని నియమించారు. ప్రస్తుత1 టౌన్ సీఐ, కాజీపేట సీఐలను కర్నూలు వీఆర్ఓ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు.

News June 19, 2024

శ్రీకాకుళం: 24 నుంచి ఏపీ ఆర్ సెట్ ముఖాముఖి

image

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీ ఆర్ సెట్ ప్రవేశాలకు గాను ముఖాముఖి ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నట్లు సెట్ కన్వీనర్ దేవప్రసాద్ రాజు మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో 12 విద్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సబ్జెక్టులు వారీగా ముఖాముఖి ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. https://cets apsche.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు పొందుపరిచామన్నారు.

News June 19, 2024

ప్రకాశం జిల్లాలో DSC కోసం 30 వేలమందికి పైగా వెయిటింగ్

image

ప్రకాశం జిల్లాలో వైసీపీ హయాంలో 410 పోస్టులున్నాయని ..వాటిలో ఎస్జీటీ 111, స్కూల్ అసిస్టెంట్లు 299, టీజీటీ 93 పోస్టులను జోనల్ స్థాయిలో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా.. ప్రస్తుతం 16,347 భర్తీ చేయనున్నారు. ప్రకాశం జిల్లాకు ఎన్ని పోస్టులనే దానిపై ఉత్కంఠ సాగుతోంది. జిల్లాలో దీని కోసం 30 వేల మంది ప్రిపేర్ అవుతున్నట్లు అంచనా..!

News June 19, 2024

తూ.గో.లో ధాన్యం బకాయిలు రూ.202.41 కోట్లు

image

రైతుల నుంచి రబీ సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యానికి తూర్పుగోదావరి జిల్లాలో రూ.202.41 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. 23,082 మంది రైతుల నుంచి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. దీనికి గాను జిల్లాలో రూ.296.31 కోట్లు మాత్రమే జమ చేశారు. ఇంకా రూ.202.41 కోట్లు చెల్లించవలసి ఉంది. ధాన్యం కొని 2 నెలలు దాటిన బకాయిలు చెల్లించకపోవడంపై రైతుల అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News June 19, 2024

నెల్లూరు జిల్లాకు రూ.33.19 కోట్ల కేటాయింపు

image

నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ కింద రూ.33.19 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి మోదీ వారణాసి నుంచి మంగళవారం ఆన్‌లైన్ విధానంలో నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. జిల్లాలో అర్హత కలిగిన 1,65,978 మంది రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు.

News June 19, 2024

కోన ఉప్పలపాడు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా చేయండి

image

యాడికి నుంచి 13కి.మీ దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య వెలసిన కోన రామలింగేశ్వరుడు ఆలయం ప్రకృతి అందాలకు నెలవుగా మారింది. ఆలయం ఎదుట కొండపై నుంచి దూకుతున్న కోన ఉప్పలపాడు జలపాతం దర్శనమిస్తుంది. దీంతో పాటు ఆలయం వెనుక ఎకరా విస్తీర్ణంలో విస్తరించిన వందల ఏళ్లనాటి మర్రి చెట్టు, ఆ పక్కనే చెరువు ఉండటంతో పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాట కేంద్రంగా అభివృద్ధి చేయాలనడంపై మీ కామెంట్.