Andhra Pradesh

News June 19, 2024

PHOTO: కేజీహెచ్‌లో గుండెలు పిండేసిన ఘటన

image

విశాఖ కేజీహెచ్‌లో మంగళవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శిరీష గర్భిణి మంగళవారం తన కుటుంబీకులతో కేజీహెచ్‌లో ప్రసూతి విభాగంలో చేరింది. అనంతరం ఆమె నెలలు నిండకుండా బిడ్డకు జన్మనివ్వగా.. ఆ శిశువును పిల్లల వార్డుకు అనుసంధానంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి నర్స్ ముందు వెళ్ళగా సిలిండర్ మోస్తూ తండ్రి వెనుక వెళ్ళారు.

News June 19, 2024

గుంటూరులో శుక్రవారం పెమ్మసాని ఆత్మీయ సమావేశం

image

తనని గెలిపించిన గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని కూటమి నేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన కార్యాలయం సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళగిరి నుంచి గుంటూరు వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News June 19, 2024

ఎమ్మిగనూరు: ఆటో బోల్తాపడి.. బాలిక మృతి

image

ఆటో బోల్తాపడి బాలిక మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాలు..గోనెగండ్లకు చెందిన రహంతుల్లా కుటుంబంతో కలిసి తన సోదరి భానును చూసేందుకని ఎమ్మిగనూరు వచ్చారు. ఈ క్రమంలో రహంతుల్లా పెద్ద కూతురు ఆల్పీషా(12)ను తీసుకుని భాను మార్కెట్‌కి వెళ్లింది. పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఎమ్మిగనూరు ఎద్దుల మార్కెట్ వద్ద ఆవులు అడ్డంగా వచ్చాయి.తప్పించబోయి ఆటో బోల్తా పడటంతో ఆల్పీషా మృతిచెందింది.

News June 19, 2024

తూ.గో.: ప్రాణం తీసిన Free Fire గేమ్..?

image

మండపేటలోని గొల్లపుంత కాలనీకి చెందిన దుర్గాకుమార్(19) తాపీ పనిచేస్తుంటాడు. మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందాడు. అతనికి ఎవరితో గొడవలు, ఆర్థికసమస్యలు లేవని కుటుంబీకులు చెబుతున్నారు. ఫోన్లో ఉన్న ఫ్రీఫైర్ గేమ్‌ మనుషులను ఒంటరి చేస్తుందని ఈకారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకొస్తాయని CIఅఖిల్ జామ తెలిపారు.

News June 19, 2024

కడపలో పోలీసుల పై కరపత్రాల కలకలం

image

కడప నగరంలో ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన వారి నుంచి డబ్బులను తీసుకుని సిబ్బందికి పంపిణీ చేయకుండా అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తు తెలియని వ్యక్తులు ‘కరపత్రాలు’ ముద్రించి రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. ఈ సంఘటన పోలీసు అధికారుల్లో అసహనం, ప్రజల్లో కలకలం రేపింది. ఈ సంఘటనపై ఎవరు కరపత్రాలను తయారు చేశారు? ఎవరు పంపిణీ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

News June 19, 2024

ఈనెల 21న హిందూస్థాన్ షిప్‌యార్డ్ వ్యవస్థాపక వేడుకలు

image

హిందుస్థాన్ షిప్ యార్డ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈనెల 21వ తేదీన నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు మంగళవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశ నిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవలు అందించే యార్డులో ఆసుపత్రిని ఆధునీకరించారు. ఉద్యోగుల నివాస సముదాయంలో 36 క్వార్టర్స్‌ను 3 దశలో మరమ్మతులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

News June 19, 2024

ప్రకాశం జిల్లాలో 2.42 లక్షల మందికి పీఎం కిసాన్ 

image

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మంగళవారం జమ చేసినట్లు ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. 17 వ విడతగా విడుదల చేసిన సాయం జిల్లాలో 2.42 లక్షల మంది రైతులకు రూ. 48.43 కోట్లు విడుదల అయినట్లు ఆయన పేర్కొన్నారు. డీబీటీ పద్ధతిలో ఒక్కో రైతుకు బ్యాంకు ఖాతాలోకి రూ.2వేలు జమ చేశారని, ఇది పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

News June 19, 2024

కృష్ణా: అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

image

పెడన మండలంలోని కొంకేపూడికి చెందిన రైతు శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు శ్రీనివాసరావుకి సుబ్బారావు, వెంకటేశ్వరరావుల మధ్య పొలం హక్కుల విషయమై విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపం చెందిన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 19, 2024

కడప: బస్సు హెల్పర్ పై దాడి.. ముగ్గురు అరెస్టు

image

కడప నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఆర్టీసీ పాత అసుపత్రి ఆవరణంలో డిసెంబర్‌ 30న హెల్పర్‌ ప్రసాద్‌పై, రవి కుమార్‌, కిషోర్‌కుమార్‌, మరో 5మందితో కలిసి దాడి చేసిన సంఘటనలో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో అరెస్టయిన వారిలో రవికుమార్‌, ప్రశాంత్‌, మునీంద్ర ఉన్నారు. ఈ ప్లేస్‌లో మరి కొంతమంది పరార్‌లో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

News June 19, 2024

శ్రీకాకుళం: ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లో 65.36 శాతం ఉత్తీర్ణత

image

ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మే నెల 24 నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో జిల్లా నుంచి 7,431 మంది విద్యార్థులు హాజరుకాగా 4,857 మంది ఉత్తీర్ణులై 65.36 శాతం ఫలితాలు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి ఉన్నత చదువులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.