Andhra Pradesh

News June 19, 2024

రాజాం: టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

image

రాజాం మండలం బోద్దాం గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ దేవత అసిరితల్లి వారాలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి గ్రామానికి చేరుకొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 19, 2024

ప్రకాశం జిల్లా అధికారులతో మంత్రి మీటింగ్

image

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టరేట్ లో బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ కార్యాలయం తెలిపింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, నూతనంగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

News June 19, 2024

శ్రీకాకుళం: రూ.45.88 కోట్లు.. 2,29,407 మంది రైతులు

image

కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పీఎం కిసాన్‌తో జిల్లాలో 2,29,407 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ.45.88 కోట్ల నిధులు జమకానున్నాయి. అర్హత కలిగిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు వ్యవసాయ పెట్టుబడి కోసం రూ.2వేలు చొప్పున జమ అవుతాయని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ తెలిపారు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఈ విడతలో పాత రైతులకే అవకాశం ఉందని కొత్త వారికి లేదన్నారు.

News June 19, 2024

కళ్యాణదుర్గం: రోడ్డుపైకి రెండు ఎలుగుబంట్లు

image

కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని కన్నేపల్లి రోడ్డుపైకి మంగళవారం సాయంత్రం రెండు ఎలుగుబంట్లు రావడం చూసి అటుగా వెళుతున్న ప్రయాణికులు భయాందోళన చెందారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని భయంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని కోరారు.

News June 19, 2024

ప.గో.: వామ్మో.. కిలో పచ్చిమిర్చి రూ.100, టమాట రూ.80

image

కూరగాయల ధరలు ఆకాశాన్నంటి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప.గో. జిల్లా తాడేపల్లిగూడెం వారసంతలో టమాట కిలో ధర రూ.80పైనే పలికింది. మిగతా కూరగాయలు సైతం రెట్టింపు ధరలు పలికాయి. అటు పప్పు దినుసుల ధరలూ భగ్గుమంటున్నాయి. ఎండాకాలం కారణంగా ప్రస్తుతం దిగుబడి లేదని అందుకే అధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు.
☛ పచ్చిమిర్చి రూ.100
☛ బీరకాయలు రూ.80
☛ బంగాళా దుంపలు రూ.60
☛ ఉల్లి రూ.50
☛ ఒక్క ములక్కాడ రూ.10

News June 19, 2024

కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలి: MP

image

కడప నుంచి విమాన సర్వీసులు పెంచాలని సీఎం రమేశ్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి మంగళవారం వినతి పత్రం అందించారు. ఉడాన్ పథకంతో దేశీయ ట్రూజెట్ సంస్థ 2018లో కడప నుంచి నాలుగు ప్రాంతాలకు రెగ్యులర్‌గా విమాన సర్వీసులు ప్రారంభిస్తే, వైసీపీ వీజీఎఫ్ చెల్లించక సర్వీసులు నిలిపివేసిందని ఆరోపించారు. కడప-ముంబయి, కడప- హైదరాబాద్ విమానాలను రెగ్యులర్‌గా నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 19, 2024

విశాఖ: ఖరీఫ్ సీజన్‌లో రూ.460 కోట్లు పంట రుణాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 20వేల మంది రైతులకు రూ. 460 కోట్ల పంట రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సీఈఓ డీవీఎస్ వర్మ తెలిపారు. విశాఖ బ్యాంక్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.319.12 కోట్ల షార్ట్ టర్మ్ పంట రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 30 బ్రాంచ్‌లు ఉన్నట్లు పేర్కొన్నారు.

News June 19, 2024

పూతలపట్టు మాజీ MLA రాజీనామాకు ఆమోదం

image

వైసీపీ ప్రభుత్వంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(PCB) సభ్యుడిగా వ్యహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మురళి మోహన్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీల్ కుమార్ తన PCB సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News June 19, 2024

కాకినాడ: 100 కేసులు దాటేశాయ్.. భయం

image

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొమ్మనాపల్లిలో 90, బెండపూడిలో 18మంది ఈ వ్యాధిన పడ్డారు. జిల్లాలో 2022లో ఐదుగురు బాధితులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటడం భయం కలిగిస్తోంది. అధికారులు వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
➠ వ్యాధి లక్షణాలు
☛ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
☛ దాహం, నోరు ఎండిపోవడం
☛ మూత్ర విసర్జన తగ్గిపోవడం.

News June 19, 2024

విజయవాడలో గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్

image

నగరంలో మంగళవారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గణేశ్ తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన గణేశ్, శివకుమార్ అనే వ్యక్తులు సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తుండగా దాడి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.