Andhra Pradesh

News June 18, 2024

జమ్మలమడుగులో 3ఏళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి: ఆది

image

జమ్మలమడుగు మున్సిపాలిటీలో 3 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఛైర్‌పర్సన్ శివమ్మ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపాలిటీకి సాధారణ నిధులు ఎంత మేర వస్తున్నాయి, ఎంత ఖర్చు చేశారన్న విషయాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

News June 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News June 18, 2024

కోడూరు: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన రైల్వే కోడూరు మండలం బొజ్జవారిపల్లె గ్రామంలో జరిగింది. మంగళవారం సాయంత్రం రైతు జనార్ధన్(51) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 18, 2024

ఉదయగిరి: గురుకుల పాఠశాలలో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

image

ఉదయగిరి మండలంలోని ఏపీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ పుష్పరాజ్ తెలిపారు. ఇంగ్లిష్, టీజీటీ, గణితం, బయోలాజికల్ సైన్స్, పీజీటీ, ఫిజికల్ సైన్స్ గెస్ట్ ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయన్నారు. 2018 డీఎస్సీ గైడ్లైన్స్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతల జిరాక్స్ కాపీలను ఈనెల 24వ తేదీలోపు అందించాలన్నారు.

News June 18, 2024

రాష్ట్రంలోని ఆలయాల పూర్వవైభవానికి కృషి: మంత్రి ఆనం

image

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయాల పూర్వవైభవానికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు సంతపేటలోని మంత్రి నివాసంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక శతాబ్ధాల చరిత్ర గల ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వీటి అభివృద్ధి, పునర్నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు.

News June 18, 2024

తిరుమల : పుకార్లను నమ్మవద్దు.. టీటీడీ విజ్ఞప్తి

image

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.

News June 18, 2024

బాపట్ల: హోంగార్డుపై దాడి.. ఇరువురికి ఐదేళ్లు జైలు శిక్ష

image

2013లో బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో హోంగార్డుపై కత్తితో దాడి చేసిన ఘటనలో, ఇరువురికి న్యాయస్థానం ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఓ కేసు విషయంలో వారిన అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన హోంగార్డుపై వారు కత్తులతో దాడి చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం వారిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వాణికుమారి వారికి శిక్ష విధించినట్లు తెలిపారు.

News June 18, 2024

నగరి: శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దు: గాలి భానుప్రకాశ్

image

తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి  ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.

News June 18, 2024

కోనసీమ: చేపల వేటకెళ్లి సముద్రంలో గల్లంతు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం భైరవపాలెం వాసి సముద్రంలో గల్లంతయ్యాడు. పెమ్మాడి కాయరాజు(33) సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, పడవలో నుంచి జారిపడి మునిగిపోయినట్లు తోటి మత్స్యకారులు తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన మత్స్యకారులతో కలిసి కాయరాజు వేటకు బయలుదేరి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ పడవలో నుంచి జారి పడినట్లు వారు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు వివరించారు.

News June 18, 2024

గంజాయి రవాణా నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్: డీసీపీ సత్తిబాబు

image

హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు గంజాయి రవాణా నిరోధానికి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రూపొందించామని డీసీపీ సత్తిబాబు తెలిపారు. విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు యాక్షన్ టీమ్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే గంజాయి వినియోగిస్తున్న కొన్ని ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నిత్యం పోలీస్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు.