Andhra Pradesh

News June 18, 2024

ATP: 5,27,620 మంది రైతులకు రూ.2 వేలు జమ

image

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదలయ్యాయి. జిల్లాలోని రైతులకు రూ.2 వేలు చొప్పున అకౌంట్లలో జమకానుంది. అనంతపురం జిల్లాలోని 2,76,147 మంది రైతులకు రూ.55.23 కోట్లు, సత్యసాయి జిల్లాలోని 2,51,473 మంది రైతులకు రూ.50.29 కోట్ల మేర సాయం అందనుంది. లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఈ లింక్ <>క్లిక్<<>> చేసి చూసుకోవచ్చు.

News June 18, 2024

వేటపాలెం: చావు దాక వెళ్లి తిరిగి వచ్చిన మత్స్యకారులు

image

వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరానికి 27 కి.మీ దూరంలో బోటు బోల్తా పడిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాములు, చిట్టిబాబు, గోవిందు, శ్రీను వేటకు వెళ్ళగా..  సముద్రంలో గాలులకు ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. ఐస్ బాక్సులు సహాయంతో సముద్రంలోనే 8 గంటలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఓమత్స్యకారుడు అటు వెళ్తు వారిని గమనించి తనబోటులో ఒడ్డుకు తెచ్చినట్లు తెలిపారు.

News June 18, 2024

శ్రీకాకుళం: మంత్రులను కలిసిన ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీ.ఆర్ రాధిక మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం వివిధ శాఖల జిల్లా ఉన్నత అధికారులు ప్రజాప్రతినిధులతో పలు అంశాలపై సమావేశం నిర్వహించారు.

News June 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News June 18, 2024

జంతువు వెంట్రుకలు, అడుగులు ల్యాబ్‌కు పంపించాం: ఫారెస్ట్ అధికారి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో నిన్న పులి కారును ఢీకొట్టింది. ఈ ఘటనపై ఆత్మకూరు ఫారెస్ట్ అధికారి శేఖర్ స్పందించారు. స్థానికుల సమాచారంతో అటవీ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం నుంచి 25 మంది సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో కాపరులకు జంతువులు ఎదురైతే సమాచారం ఇవ్వాలని కోరారు. కారుకు తగిలిన వెంట్రుకలు, జంతువు అడుగులు ల్యాబ్ కు పంపించామని తెలిపారు.

News June 18, 2024

అమ్మవారి సేవలో సినీ దర్శకుడు త్రివిక్రమ్

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఫోర్ట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News June 18, 2024

పంట నష్టాన్ని నివేదించండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో గత సంవత్సరం రబీ సీజన్‌లో పంట నష్టపోయిన వివరాలను ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంకు స్పష్టంగా నివేదించాలని జిల్లా కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన చాంబర్లో కేంద్ర కరువు బృంద పర్యటనపై జెసి టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

News June 18, 2024

ప్రకృతి అందాల్లో మహానంది

image

దట్టమైన నల్లమల అడవుల్లో వెలిసిన మహానంది క్షేత్రం మహదానందానికి నిలయం. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఆలయ పరిసరాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. భక్తులు నల్లమల అందాలు చూసి పరవశించిపోతున్నారు. ఆలయం వెనుకవైపు నల్లమల పచ్చగా కనిపిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. పక్షుల కిలకిలారావాలు, నల్లమల పచ్చటి అందాలకు పొగమంచు తోడవడంతో మహానంది ఊటీ అందాలను తలపిస్తోందంటూ భక్తులు కామెంట్ చేస్తున్నారు.

News June 18, 2024

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు

image

తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఆలయ గోపురాన్ని ఏపీ ప్రభుత్వం 10వ తరగతి పాఠ్యపుస్తకాలపై ముద్రించింది. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం పెన్నానది ఒడ్డున వెలసింది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉండటం ఇక్కడి విశిష్టత. అలాగే శివలింగం మీద నేరుగా సూర్యకిరణాలు పడటం, ఆలయంలోని స్తంభాలను చేతులతో టచ్ చేస్తే సప్త స్వరాలు పలుకుతాయి.

News June 18, 2024

ర్యాంకుల వారీగా ITI కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

image

ఈనెల 18 నుంచి 23 వరకు ఐటిఐ కౌన్సిలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కౌన్సిలింగ్ ఉదయం, మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారం జరగనుంది. జిల్లాలో మొత్తం 2,470 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18వ తేదీన 1 నుంచి 413 ర్యాంకు వరకు, 19న 414-877 వరకు, 20న 878-1399 వరకు, 21న 1400-1873 వరకు, 22న 1874-2305 వరకు, 23న 2306-2470 వరకు వచ్చిన ర్యాంకుల వారికి గ్రేడ్స్ బట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది.