Andhra Pradesh

News June 18, 2024

కర్నూల్: ఎన్నికల వేళ రాజీనామా.. ఖాళీలు ఎన్నంటే?

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 4806 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News June 18, 2024

మాజీ సీఎం జగన్‌పై అనంతపురం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

image

మాజీ సీఎం జగన్‌పై టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్వి అనంతపురం ఎస్పీ గౌతమి షాలికి ఫిర్యాదు చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగనే కారణమని.. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఈమేరకు జిల్లా ఎస్పీ గౌతమి షాలికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట జిల్లా టీడీపీ మహిళా నేతలు ఉన్నారు.

News June 18, 2024

దర్శి: ‘ఎమ్మెల్సీ గారి తాలూకా’ అంటూ స్టిక్కర్లు

image

దర్శిలో ‘MLC గారి తాలూకా’ అంటూ బైక్లు, కార్లపై స్టిక్కర్లు వెలిశాయి. దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి MLC కేటాయించాలంటూ నియోజకవర్గ TDP శ్రేణులు గట్టిగానే పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు గొట్టిపాటి అభిమానులు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జిల్లాలో గొట్టిపాటి ఫ్యామిలీకి చంద్రబాబు మంచి విధేయుడని, కచ్చితంగా లక్ష్మికి MLC పదవి దక్కుతుందని ఆమె వర్గీయులు ఆశిస్తున్నారు.

News June 18, 2024

సత్యసాయి: అధికారుల పనితీరు స్ఫూర్తిదాయకం

image

సార్వత్రిక ఎన్నికల్లో సత్యసాయి జిల్లాలోని అధికారుల పనితీరు స్ఫూర్తిదాయకమని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీచేసిన అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై కలెక్టర్ వివిధ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల సహకారంతో జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.

News June 18, 2024

ఇంటర్ సప్లీ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు 19వ స్థానం

image

ఇంటర్ సెకండీయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3096 మంది పరీక్ష రాయగా, 1666 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 54 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒకేషనల్ కోర్సులో ఏలూరు జిల్లా 11వ స్థానంలో నిలిచింది. మొత్తం 541 మంది పరీక్ష రాయగా, 322 మంది పాస్ అయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత సాధించారు.

News June 18, 2024

BNకండ్రిగ: గుండెపోటుతో టీచర్ మృతి

image

తిరుపతి జిల్లా BNకండ్రిగ మండలం సుగుపల్లి గ్రామానికి చెందిన తొడకాటి పురుషోత్తం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గణిత టీచర్‌గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పారు. యోగా గురువు పోచినేని సురేష్ నాయుడు టీచర్ మృతిపై సంతాపం తెలిపారు.

News June 18, 2024

శ్రీకాకుళం: ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో ఏడో స్థానం

image

కాసేపటి క్రితం ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,431 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,857 మంది పాసయ్యారు. జిల్లాలో 65 శాతం ఉత్తీర్ణత నమోందైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 7వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్‌ గ్రూప్‌లో 322 విద్యార్థులు రాయగా 221 మంది పాసయ్యారు. దీనిలో 69 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.

News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో కోనసీమకు 25వ స్థానం

image

ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా 25వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3194 మంది పరీక్ష రాయగా.. 1395 మంది(44 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 710 మంది పరీక్ష రాయగా.. 326 మంది (46శాతం) పాస్ అయ్యారు.

News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో తూ.గో జిల్లాకు 23వ స్థానం

image

ఇంటర్ సెంకడ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో తూర్పు గోదావరి జిల్లా 23వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3361 మంది పరీక్ష రాయగా.. 1662 మంది(49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో తూ.గో జిల్లా వ్యాప్తంగా 422 మంది పరీక్ష రాయగా.. 216మంది (51శాతం) పాస్ అయ్యారు.

News June 18, 2024

ఇంటర్ సప్లిమెంటరీ Results.. నెల్లూరుకు 4th ర్యాంక్

image

ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 4970 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3675 మంది పాసయ్యారు. 75 % పాస్ పర్సంటేజ్‌తో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లాలో 6023 మందికి 3602 మంది పాసయ్యారు. 60 % పాస్ పర్సంటేజ్‌తో 13వ స్థానంలో నిలిచింది. ఒకేషన్లో నెల్లూరు విద్యార్థులు 412 మందికి 325 మంది.. తిరుపతిజిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.