India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో. జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అద్నాన్ నయీం అస్మి బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడును పాలకొల్లులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రికి పూలమొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల గురించి ఇరువురు కాసేపు చర్చించుకున్నారు.
మంత్రి సవిత నేడు రొద్దం మండలంలో పర్యటిస్తారని ఆమె కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు మండల పరిధిలోని కోగిర చెరువును పరిశీలిస్తారన్నారు. అనంతరం పెద్ద కోడి పల్లి చెరువు మరువని పరిశీలిస్తారని, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొనాలని పేర్కొన్నారు.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆక్రమించిన భూముల విలువ రూ.35,576 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు, ఉచిత ఇసుక పేరుతో రూ.9,750 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులతో రాష్ట్రంలోని రహదారులను అనుసంధానం చేస్తూ వివిధ దశల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, భూ సేకరణ సమస్యలు, నూతనంగా నిర్మించాల్సిన రహదారులపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పార్వతిపురం జిల్లా వైశ్య సభ్యులకు రాష్ట్ర స్థాయి వైశ్య సంఘంలో చోటు కల్పించాలని టీడీపీ బీసీ సాధికారిక జిల్లా కో-ఆర్డినేటర్ కోరాడ రాజేశ్ కోరారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు వైశ్యులకు చేరాలన్నా, జిల్లా వైశ్య కుటుంబాలు సమస్యలు చెప్పాలన్నా రాష్ట్ర కమిటీలో జిల్లా వైశ్య సభ్యులకు చోటు కల్పించాలన్నారు. వైశ్యుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు.
ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాతో తనకు మంచి అనుబంధం ఉందని, జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా భావిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
దొరవారిసత్రం మండలం నెలబల్లి అడవిలో ఇవాళ దారుణ హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సందర్శించారు. పోస్టు మార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసన్ రెడ్డి, సీఐలు జగన్మోహన్, శ్రీనివాసులు ఉన్నారు.
రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్లో డిజిటల్ బోర్డులు, పార్కింగ్, సి.సి కెమెరాలు, లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని బీజేపీ రైల్వే కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పేరుకే రైల్వేకోడూరు కానీ ఇక్కడ ముఖ్యమైన రైళ్లు ఆగవు అంటూ నిరసన తెలిపారు. హరిప్రియ ఎక్స్ప్రెస్, వాస్కోడిగామా, ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లకు “స్టాపింగ్” కల్పించాలని రైల్వేస్టేషన్ మాస్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
నేటి నుంచి ఈనెల 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కోరారు. కొత్త సభ్యత్వ నమోదుతోపాటు, సభ్యత్వ రెన్యువల్ జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాలని సూచించారు.
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 2,586 అడుగులుగా నమోదయింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో డుడుమ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.
Sorry, no posts matched your criteria.