Andhra Pradesh

News June 18, 2024

కలసపాడు: అనుమానాదస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కలసపాడు మండలంలోని కొండపేట గ్రామంలో సోమవారం ఇండ్లా శీను(31)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ విజయకుమార్ తెలిపారు. శీను సోదరుడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు.

News June 18, 2024

సింహాచలంలో 6 గంటల వరకే అప్పన్న దర్శనాలు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు నేడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 18, 2024

శ్రీకాకుళం: ప్రయాణికులకు APSRTC కీలక  సూచన 

image

శ్రీకాకుళం ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికి APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866- 149 నంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News June 18, 2024

కృష్ణా: స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.12803, నం.12804 స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 5 వరకు విజయవాడ-బల్లార్షా-నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా నాగ్‌పూర్ చేరుకుంటాయన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

News June 18, 2024

అనంత: రానున్న రెండు రోజుల్లో ఉరుములతో కూడిన వర్షాలు

image

రానున్న రెండు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే సూచన ఉందన్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

News June 18, 2024

నకరికల్లు: ఇద్దరు బాలికలపై వృద్ధుడి లైంగిక దాడి

image

8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నకరికల్లు మండలంలో సోమవారం వెలుగుచూసింది. నకరికల్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(62) ఇద్దరు బాలికలకు మాయ మాటలు చెప్పి, 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ బాలిక కడుపు నొప్పితో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 18, 2024

చిత్తూరు: ఉద్యోగం పేరుతో చీటింగ్

image

ఉద్యోగం పేరుతో మోసం చేసిన ముగ్గురిపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం సంతపేటకు చెందిన వైష్ణవి(24) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. మురకంబట్టుకు చెందిన రాజేశ్, విజయ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఉద్యోగం తీసిస్తామని చెప్పి ఆమె వద్ద రూ.2.90 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం తీసి ఇవ్వకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News June 18, 2024

జూన్ 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమల శ్రీవారి వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు ఆన్ లైన్ కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను 22న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

News June 18, 2024

ప.గో: ముగిసిన రేషన్ పంపిణీ

image

పశ్చిమ గోదావరి జిల్లాలో జూన్ నెల రేషన్ పంపిణీ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం లోపు రిటర్న్ స్టాక్ తీయాల్సిందిగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో జులై నెల నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానంపై ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

News June 18, 2024

తూ.గో జిల్లాలో 98,550 మందికి లబ్ధి: కలెక్టర్

image

‘కిసాన్ సమ్మేళన్’లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులు విడుదల చేయనున్నారని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే.మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 98,550 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున మొత్తం రూ.19.71 కోట్లు జమ కానున్నట్లు తెలియజేశారు.