Andhra Pradesh

News June 18, 2024

గుంటూరు: ఈనెల 22న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

image

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 22న శనివారం ఉదయం 10.30కి జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

News June 18, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి- విశాఖపట్నం(నెం.08505) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే పేర్కొంది. ఈ నెల 18, 23, 25, 30 వ తేదీల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు విజయనగరం, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్ తదితర స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 18, 2024

రేపు కడపకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రేపు కడపకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు సాయంత్రం కడప కలెక్టర్ కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో కడప నుంచి ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన పూర్తి షెడ్యూల్ తెలియాల్సి ఉంది.

News June 18, 2024

నేడు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 18, 2024

గూడూరు-రేణిగుంట 3వ రైల్వేలైను‌కు గ్రీన్ సిగ్నల్

image

గూడూరు-రేణిగుంట మధ్య 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ప్రధానమంత్రి జాతీయ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ లైన్ నిర్మించనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య 83.17KM దూరానికి రూ.884 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. 2 రైల్వే వంతెనలు, అండర్ పాస్లు నిర్మించాల్సి ఉండగా ఈ ప్రాజెక్టు కోసం 36.58 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ లైన్ పూర్తయితే గూడూరు నుంచి రేణిగుంటకు తక్కువ సమయంలో చేరొచ్చు.

News June 18, 2024

సింహాచలం: 6 గంటల వరకే అప్పన్న దర్శనాలు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దర్శనాలు ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 18, 2024

శ్రీశైలం: మల్లన్నకు వెండి రథోత్సవ సేవ

image

శ్రీశైల దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవ సేవ నిర్వహించారు. కాగా శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథోత్సవంలో వేంచేపు చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రదక్షిణ గావించారు. వెండి రథోత్సవంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

News June 18, 2024

ధర్మవరం: మంత్రి సత్యకుమార్ పర్యటన నేటి షెడ్యూల్ ఇదే

image

మంగళవారం మంత్రి సత్యకుమార్ ధర్మవరంలో పర్యటించనున్నారు. తొలుత కదిరి గేటు వద్దనున్న చేనేత విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి దిమ్మెల సెంటర్ మీదుగా తేరుబజారుకు వెళతారు. అనంతరం దుర్గమ్మగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. అక్కణ్నుంచి కళాజ్యోతి సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పిస్తారు. మారుతీనగర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.

News June 18, 2024

విజయనగరం: వైసీపీకి సీనియర్ నేత రాజీనామా

image

జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.

News June 17, 2024

కృష్ణా: CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ఫొటోలతో ర్యాలీ చేసిన మంత్రి

image

నూజివీడు నియోజకవర్గం నుంచి TDPతరఫున MLAగా గెలిచిన కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, గృహనిర్మాణ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నూజివీడులో పార్టీ శ్రేణులు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు ఇవ్వగా అవి పట్టుకొని ర్యాలీగా ముందుకుసాగారు.