Andhra Pradesh

News June 17, 2024

రంపచోడవరం: గుండె పోటుతో ఉద్యోగి మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఓ సంస్థ డివిజనల్ మేనేజర్‌గా పని చేస్తున్న చింతా మధు(52) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడని సంస్థ సిబ్బంది తెలిపారు. విశాఖలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లోనే కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News June 17, 2024

కృష్ణా: ప్రయాణికులకు కీలక సూచన చేసిన APSRTC

image

కృష్ణా- ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికై APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866-149 నెంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News June 17, 2024

వట్టిచెరుకూరు: పొక్లెయిన్ ఆపరేటర్ ఆత్మహత్య

image

వట్టిచెరుకూరు మండలం తాళ్లపాడు గ్రామానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ శివన్నారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. ఆవిరేణి కుంట తాండ గ్రామ సమీపంలో పొక్లెయిన్ విధులు నిర్వహిస్తున్న శివ నారాయణ కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆ వాహనానికే ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

News June 17, 2024

విజయనగరం: వైసీపీకి సీనియర్ నేత రాజీనామా

image

జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పోతన్న వైసీపీకి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కు దశాబ్దాల కాలంగా సేవలందించిన ఈయన, మాజీ మంత్రి పెనుమత్స కు అత్యంత విధేయుడు గా పేరొందారు. వైఎస్సార్ మరణాంతరం వైసీపీ లో చేరి తన సేవలందించారు. పార్టీ కి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుకి తన రాజీనామా లేఖను పంపారు.

News June 17, 2024

సింహాచలం: 6 గంటల వరకే అప్పన్న దర్శనాలు

image

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దర్శనాలు ఈనెల 18న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లభిస్తాయని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్. శ్రీనివాస్ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి సోదరి అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం జరుగుతుందన్నారు. ఈ కారణంగా దర్శనాలు 6 గంటల తర్వాత లభించవని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 17, 2024

శ్రీకాకుళం: AU పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో MSC గణితం కోర్సు 2వ సెమిస్టర్ (2020- 21 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 1 మధ్య 5 రోజులపాటు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 17, 2024

ఎన్నికల ముందు బయటపడితే 11 సీట్లు కూడా వచ్చేవి కావు: గంటా

image

రుషికొండ రాజకోట రహస్యం ఎన్నికలకు ముందు బయటపడితే వైసీపీకి ఆ 11 సీట్లు కూడా వచ్చేది కాదని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. రుషికొండ భవనాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. ముందు టూరిజం ప్రాజెక్ట్ అని తర్వాత ఫైవ్ స్టార్ హోటల్‌గా, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ప్రకటించి మభ్య పెట్టారని అన్నారు. సెక్యూరిటీ పేరుతో తప్పించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

News June 17, 2024

వాడపల్లిలో పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.

News June 17, 2024

ప.గో: పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.

News June 17, 2024

వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన వాయిదా

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపటినుండి 5 రోజులు పాటు జిల్లాలో ఇడుపులపాయతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన ఉండగా..19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.