Andhra Pradesh

News June 17, 2024

నెల్లూరు: కారుపై పెద్దపులి దాడి

image

నెల్లూరు జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపింది. మర్రిపాడు మండలంలోని కదిరి నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో హైవేపై వెళ్తున్న కారుపై సోమవారం ఉదయం పులి దాడి చేసింది. ఒక్కసారిగా రోడ్డుపైకి పులి రావడంతో కారులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం ధ్వంసమైంది. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పెద్దపులి సంచారంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

News June 17, 2024

అనంత: బిల్డింగ్ నుంచి దూకి యువకుడి సూసైడ్

image

బిల్డింగ్ నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇవాళ జరిగింది. పోలీసులు వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. పరీక్ష రాసి ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్‌‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఇవాళ హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News June 17, 2024

రేపు వైద్యారోగ్యశాఖ మంత్రి అనంతపురానికి రాక

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ ఈనెల 18వ తేదీన అనంతపురం రానున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. వై.సత్య కుమార్ యాదవ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా అనంతపురం రానున్న నేపథ్యంలో సప్తగిరి సర్కిల్, ఓల్డ్ టౌన్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News June 17, 2024

కోనసీమ: దారుణం.. 9 ఏళ్ల బాలికపై అత్యాచారం

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లి పల్లెపాలెంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ సంఘటనపై బాలిక తండ్రి 16వ తేదీ (ఆదివారం) రాత్రి ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సంపత్ కుమార్ తెలిపారు.

News June 17, 2024

పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం: మంత్రి

image

వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తిన్నదంతా కక్కిస్తామని రవాణ శాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ‘పెద్దిరెడ్డి పాపాలన్నీ బయటకు తీస్తాం. అక్రమ సంపాదన కోసం పాలు, ఇసుక, మద్యం, ఎర్రచందనం దేన్నీ ఆయన ఫ్యామిలీ వదల్లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అనుమతులు లేకుండా రూ.700 కోట్లతో రిజర్వాయర్ కట్టారు. అక్కడ రైతుల భూములు లాగేసుకున్నారు’ అని ఆయన ఆరోపించారు.

News June 17, 2024

కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ రాక..!

image

కడప జిల్లాకు మంగళవారం మాజీ సీఎం జగన్ రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి సొంత జిల్లాకు రానున్నారు. మంగళవారం నుంచి నాలుగు లేదా ఐదు రోజులు పాటు ఇడుపులపాయ, కడప జిల్లాలో ఉండి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

News June 17, 2024

కర్నూలు: ముంతాజ్ బేగంకు జాతీయ యోగా పురస్కారం

image

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగంకు జాతీయ యోగా టీచర్ అవార్డుతో పాటు యోగారత్న అవార్డును హరియాణాకు చెందిన మానవియ్య నిర్మాణ్ మంచ్ ఇండియా ప్రకటించింది. 15ఏళ్లుగా నిర్విరామంగా యోగాతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఈ అవార్డు అందజేయనున్నారు. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డును ముంతాజ్ బేగం హరియణాలో అందుకోనున్నారు.

News June 17, 2024

బక్రీద్ ఎఫెక్ట్.. బారాషాహిద్ దర్గాలో సందడి

image

బక్రీద్ సందర్భంగా నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ దర్గాను సందర్శించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.

News June 17, 2024

ఏలూరు: సంతానం లేని వారికి GOOD NEWS

image

సంతానం లేనివారికి ఏలూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఓ దారి చూపుతోంది. శాఖ ఆధీనంలో ఏలూరులో శిశుగృహం నిర్వహిస్తోంది. వివిధ కారణాలతో నిరాశ్రయులైన చిన్నారులను ఇక్కడ చేర్చుకొని ఆలనాపాలనా చూస్తోంది. అయితే సంతానం లేనివారెవరైనా వస్తే నిబంధనల మేరకు దత్తత ఇస్తున్నారు. గత 14 ఏళ్లలో 82 మందిని దత్తత ఇచ్చారు. www.cara.nic.inలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఐదేళ్లలోపు 8 మంది పిల్లలున్నారు.

News June 17, 2024

కర్నూలు: మాజీ పంచాయతీ సభ్యుడు మృతి

image

మద్దికేర మండల కేంద్రానికి చెందిన పంచాయతీ మాజీ వార్డు సభ్యుడు చాకలి నాగేశ్ (52) ఇవాళ మృతిచెందాడు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, సర్పంచ్ బండారు సుహాసిని, వైసీపీ నాయకులు, రజక సంఘం నాయకులు నివాళులర్పించారు.