India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సోమవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించి కార్యక్రమం వివరాలు I&PR కార్యాలయం విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల జెండా ఆవిష్కరణ చేయనున్నారు. కలెక్టర్ సందేశం, శకటాల ప్రదర్శన, విద్యార్థిని, విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత జాతీయ గీతాలాపనతో ముగుస్తుందన్నారు.

శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల నమోదుని రద్దు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని జరిగే ఈ కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు ఎవరు జిల్లా కేంద్రానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వెంపటి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1950 ఆగస్ట్ 12న గుడ్లవల్లేరులో ఆయన జన్మించారు. అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడప సిద్ధమైంది. కడప పోలీస్ పెరేడ్ మైదానంలో రేపు ఉదయం 8:30 గంటలకు జాతీయ జండాను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎగురవేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. వేడుకలకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డా. నోరి దత్తాత్రేయకు కేంద్రం పద్మ భూషన్ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన డా. నోరి 1947లో జన్మించారు. మచిలీపట్నంలో పాఠశాల విద్య, కర్నూలులో వైద్య విద్యనభ్యసించారు. ప్రపంచంలోనే క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఆయన పేరుగాంచారు. 2015లోనూ డా.నోరి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి BJPలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 1980లో కోగటం సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంబించారు. ఆ తర్వాత LM బ్యాంక్ ఛైర్మన్, కమలాపురం MPP, కడప DCMS ఛైర్మన్, కమలాపురం MLAగా 3సార్లు పనిచేశారు. కుమారుడు అనిల్ DCCB ఛైర్మన్‌గా పని చేశారు. గతంలో కాంగ్రెస్, TDP, YCPలో పనిచేసిన ఆయన ఇప్పుడు BJPలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది.

పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జెండా వందనం జరిగే మైదానంలో ఆదివారం పైలట్ వాహనానికి ట్రయిల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలియజేస్తూ స్టాళ్లను, శకటాలను సిద్ధం చేశారు. వివిధ సంక్షేమ పథకాల కింద 13,113 మందికి రూ.809.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పమిడిముక్కలకు చెందిన ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు, గుడ్లవల్లేరుకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి, నిమ్మకూరుకు చెందిన ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరి ముగ్గురు ఆయా రంగాలకు చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే విధంగా గ్రౌండ్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అతిథులు కూర్చునేందుకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయుధ బలగాల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు అనుకూలంగా గ్రౌండ్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ డీకే బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వేడుకల కోసం ప్రత్యేక వేదికలు, గ్యాలరీ, స్టాల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలను వివరించే శకటాలను సిద్ధం చేశామన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణతో కలెక్టరేట్ భవనం కనువిందు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.