Andhra Pradesh

News September 27, 2024

‘సాంకేతికతతో మెరుగైన ఉపాధి అవకాశాలు’

image

ప.గో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లబ్ధిదారులకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందించడంలో సాంకేతికత, సౌర విద్యుత్‌ను వినియోగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్‌ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్‌ అండ్‌ వాటర్‌, న్యూఢిల్లీ (సీఇఇడబ్ల్యూ) ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

News September 27, 2024

తిరుమలకు నేడు YS జగన్

image

YCP అధినేత జగన్ నేడు తిరుమలకు రానున్నారు. లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ జగన్ పర్యటన సామాన్య ప్రజలతో పాటూ పోలీసులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మధ్యాహ్నం 4.50కు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న జగన్, అక్కడి నుంచి రోడ్డు మార్గాన 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. 28న ఉదయం 10:30కు శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉప్పటికే పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

News September 27, 2024

సారవకోటలో బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు హేమసుందరావు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. ఆ బాలిక 9వ తరగతి చదువుతుండగా.. మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

News September 27, 2024

విజయవాడ నుంచి బెంగుళూరుకు APSRTC ఏసీ బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ నుంచి బెంగుళూరు(ఎలక్ట్రానిక్ సిటీ)కు అమరావతి వోల్వో AC బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5.46 గంటలకు బెంగుళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు రాత్రి 7.30 గంటలకు బెంగుళూరులో బయలుదేరి ఉదయం 7.40 గంటలకు విజయవాడ చేరుతుందని, ప్రయాణికులు ఈ సర్వీసును ఆదరించాలని RTC విజ్ఞప్తి చేసింది.

News September 27, 2024

దెందులూరు: వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి

image

దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో గురువారం రాత్రి విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పురస్కరించుకొని విగ్రహ నిమజ్జనంలో గ్రామానికి చెందిన సింహాద్రి అయ్యప్ప(28) పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు స్థానిక చెరువులో గల్లంతయ్యాడు. వెలికి తీసిన తోటి వారు హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.

News September 27, 2024

తూ.గో జిల్లాలో చిరుత కోసం వేట

image

కడియపులంకలో చిరుత సంచారం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. చిరుతను బంధించేందుకు వారు రేయిపగలు శ్రమిస్తున్నారు.లంకల వైపు వెళ్లిన చిరుత బుధవారం పడ్డ వర్షానికి తిరిగి వెనక్కి కడియపులంకకు వచ్చేసినట్లు పాదముద్రల ఆధారంగా డీఎఫ్‌‌‌‌వోలు తెలిపారు. దానికోసం 60 మంది సిబ్బంది, 2బోన్లు,10 మేకలు సిద్ధంగా ఉంచామన్నారు. అయితే గురువారం గుర్తించిన మేరకు ఓ నర్సరీ షెడ్డు వద్ద కుక్కలను తరిమినట్లు గుర్తించామన్నారు.

News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదుగురు తహశీల్దార్లకు బదిలీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో ఐదుగురు తహశీల్దారులకు బదిలీ జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మనాభం తహశీల్దార్ ఎం.ఆనంద్ కుమార్‌ను పెందుర్తికి, పెందుర్తి తహశీల్దార్ కే.వేణుగోపాల్‌ను VMRDAకి, అక్కడ పనిచేస్తున్న కే.ఆనందరావును పద్మనాభంకు బదిలీ చేశారు. సబ్బవరం తహశీల్దార్ రవికుమార్‌ను అల్లూరి జిల్లాకు, కలెక్టరేట్ నుంచి చిన్నికృష్ణను అనకాపల్లికి బదిలీ చేశారు.

News September 27, 2024

రేపు క్రోసూరులో జాబ్ మేళా.. రూ.30వేల వరకు జీతం

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 5కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో.. రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. పది, డిగ్రీ, డిప్లమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి.. 18-35ఏళ్లు ఉన్నవారు అర్హులు. SHARE IT.

News September 27, 2024

VZM: అభిమానులతో మంత్రి లోకేశ్ ఫొటోలు

image

డెంకాడ మండలంలోని జాతీయ రహదారిపైనున్న నాతవలస టోల్‌ గేట్‌ వద్ద సిబ్బందితో మంత్రి నారా లోకేశ్ గురువారం సందడి చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో టోల్‌ గేట్‌ వద్ద కాసేపు ఆగి కార్యకర్తలు, అభిమానుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా టోల్ గేట్ సిబ్బంది లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.

News September 27, 2024

విశాఖలో NTR ఫ్యాన్స్ నిరసన

image

విశాఖ సంగం-శరత్ థియేటర్ వద్ద NTR నటించిన ‘దేవర’చిత్రం విడుదల సందర్భంగా డీజే ఏర్పాటుపై పోలీసులకు ఫ్యాన్స్‌కు మధ్య గురువారం రాత్రి వాగ్వివాదం జరిగింది. థియేటర్ వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఫ్యాన్స్ నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డీజే ఏర్పాటుకు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు.