Andhra Pradesh

News June 17, 2024

టీడీపీలోకి వెళ్లడంపై స్పందించిన ఆలూరు ఎమ్మెల్యే

image

ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌ను కాదని పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే విరూఫాక్షి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లడానికి తన ఆత్మసాక్షి ఒప్పుకోదని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు పత్రికల్లో వస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వదంతులు నమ్మెుద్దని ప్రజలను కోరారు.

News June 17, 2024

కొండపల్లి.. కొండంత అండ అవుతారా..!

image

పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే ఎమ్మెల్యే అయ్యి కేబినేట్‌లో చోటు దక్కించుకున్న కొండపల్లి శ్రీనివాస్‌పై జిల్లా ప్రజలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. MSME మంత్రిగా అవకాశం రావడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిర్మూళన దిశగా, NRI సాధికారత& సంబంధాలతో విదేశాల్లో ఉండే జిల్లా ప్రజానీకానికి అండగా నిలవాలని కోరుతున్నారు.

News June 17, 2024

టెక్కలి: యువకుడి మృతదేహం లభ్యం

image

టెక్కలి మండలం జెండాపేట గ్రామం సమీపంలో ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని టెక్కలి పోలీసులు గుర్తించారు. అతని వద్ద లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హుమయున్ మియా (37)గా గుర్తించారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

News June 17, 2024

పవన్‌కు కేటాయించిన శాఖలతో పిఠాపురంలో అభివృద్ధి

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో TDP నాయకులు, కార్యకర్తలను ఆదివారం సాయంత్రం మాజీ MLA SVSN వర్మ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌కు కేటాయించిన శాఖలు రాష్ట్రం, పిఠాపురం అభివృద్ధికి దోహదపడేలా ఉన్నాయన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి శాఖలతో నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఉప్పాడ, చేబ్రోలులో అన్నక్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News June 17, 2024

నెల్లూరు: MLA అని ఉంచడంపై విమర్శలు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది సీట్లను TDP కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిచిన YCP ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు. ఈక్రమంలో సోషల్ మీడియాలోని తమ ఖాతాల్లో కావలి, నెల్లూరు సిటీ, కోవూరు మాజీ MLAలు అని రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి అప్‌డేట్ చేశారు. ఆత్మకూరు MLA మేకపాటి విక్రమ్ రెడ్డి అని ఆయన ట్విటర్(X) ఖాతాలో ఇంకా అలాగే ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.

News June 17, 2024

మైదుకూరు: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

కడప – మైదుకూరు జాతీయ రహదారిలో మైదుకూరుకు చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటలకు బైకుపై కడప నుంచి మైదుకూరు వెళ్ళే మార్గంలో ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. అది గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారని తెలిపారు.

News June 17, 2024

BREAKING: తాడిపత్రిలో దారుణ హత్య

image

తాడిపత్రిలో దారుణ హత్య జరిగింది. తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన లాల్‌స్వామి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసి హత మార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News June 17, 2024

హైదరాబాదులో పల్నాడు జిల్లా వాసి కిడ్నాప్

image

వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాపైన వ్యక్తిని పోలీసులు వికారాబాద్‌లో రక్షించారు. గచ్చిబౌలి SI వివరాల ప్రకారం .. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన చదలవాడ సాయి గుప్తా(35) కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. గౌతమ్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. గౌతమ్ ఇచ్చిన డబ్బుకు ఆధారాలు లేకపోవడంతో కిడ్నాప్‌ చేసైనా దొంగ డాక్యుమెంట్లు రాయించుకోవాలని సాయిని కిడ్నాప్ చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 17, 2024

రుషికొండ వివాదంపై మీ కామెంట్

image

విశాఖ వేదికగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, జనసేన ఇన్ ఛార్జ్ పంచకర్ల సందీప్ స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆదివారం సందర్శించారు. ఆ భవనాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రజా ధనాన్ని వృథా చేసి జగన్ రాజభవనాలు కట్టుకున్నారని టీడీపీ ఆరోపించగా.. అవి ప్రభుత్వ భవనాలే అని వైసీపీ తేల్చి చెబుతోంది. మరి ఈ వివాదంపై మీ కామెంట్

News June 17, 2024

దేవుడు దగ్గర తప్పు చేయను: చెవిరెడ్డి

image

ఒకే లెటర్‌పై 56 మందిని శ్రీవారి దర్శనానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిఫర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన స్పందించారు. ‘TTD నిబంధనల మేరకు సోమవారం నుంచి గురువారం వరకు స్థానిక MLAగా 10 మందికి, ప్రభుత్వ విప్‌గా మరో 10 మందికి లెటర్ ఇచ్చా. తుడా ఛైర్మన్‌, TTD పాలకమండలి సభ్యుడిగా నా బిడ్డ మోహిత్ 20 మందిని సిఫార్సు చేశాడు. దేవుడు దగ్గర తప్పు చేయను. ఆ మనస్తత్వం నాది కాదు’ అని ఆయన అన్నారు.