Andhra Pradesh

News June 17, 2024

హైదరాబాదులో పల్నాడు జిల్లా వాసి కిడ్నాప్

image

వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాపైన వ్యక్తిని పోలీసులు వికారాబాద్‌లో రక్షించారు. గచ్చిబౌలి SI వివరాల ప్రకారం .. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన చదలవాడ సాయి గుప్తా(35) కూకట్‌పల్లిలో ఉంటున్నాడు. గౌతమ్ అనే వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. గౌతమ్ ఇచ్చిన డబ్బుకు ఆధారాలు లేకపోవడంతో కిడ్నాప్‌ చేసైనా దొంగ డాక్యుమెంట్లు రాయించుకోవాలని సాయిని కిడ్నాప్ చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.

News June 17, 2024

రుషికొండ వివాదంపై మీ కామెంట్

image

విశాఖ వేదికగా రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రుషికొండ భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, జనసేన ఇన్ ఛార్జ్ పంచకర్ల సందీప్ స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆదివారం సందర్శించారు. ఆ భవనాల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రజా ధనాన్ని వృథా చేసి జగన్ రాజభవనాలు కట్టుకున్నారని టీడీపీ ఆరోపించగా.. అవి ప్రభుత్వ భవనాలే అని వైసీపీ తేల్చి చెబుతోంది. మరి ఈ వివాదంపై మీ కామెంట్

News June 17, 2024

దేవుడు దగ్గర తప్పు చేయను: చెవిరెడ్డి

image

ఒకే లెటర్‌పై 56 మందిని శ్రీవారి దర్శనానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిఫర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన స్పందించారు. ‘TTD నిబంధనల మేరకు సోమవారం నుంచి గురువారం వరకు స్థానిక MLAగా 10 మందికి, ప్రభుత్వ విప్‌గా మరో 10 మందికి లెటర్ ఇచ్చా. తుడా ఛైర్మన్‌, TTD పాలకమండలి సభ్యుడిగా నా బిడ్డ మోహిత్ 20 మందిని సిఫార్సు చేశాడు. దేవుడు దగ్గర తప్పు చేయను. ఆ మనస్తత్వం నాది కాదు’ అని ఆయన అన్నారు.

News June 17, 2024

ప.గో.: పవన్ గెలుపు.. మోకాళ్లపై మెట్లెక్కిన అభిమాని

image

ప.గో. జిల్లా పెరవలి మండలం నడుపల్లి గ్రామానికి చెందిన పువ్వుల సత్తిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని. కాగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ గెలిస్తే ద్వారకాతిరుమలకు కుటుంబీకులతో పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నాడు. పవన్ గెలిచిన నేపథ్యంలో పాదయాత్రగా వెళ్లి ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయం ముందున్న 108 మెట్లను మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకున్నాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నాడు.

News June 17, 2024

కర్నూలు: పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి

image

పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుగ్గలి మండలం రామలింగాయపల్లి సమీపంలో ఆ గ్రామానికి చెందిన నలుగురు కొండలో గొర్రెల మంద వద్ద కాపలాగా ఉండగా పిడుగు పడింది. ఈ ఘటనలో కామేశ్వరి(35), సుంకన్న(47) మృతిచెందగా.. మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారి మృతదేహాలను ఇతర కాపారులు గ్రామానికి తీసుకువచ్చారు.

News June 17, 2024

విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైలు

image

విశాఖ-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డిసిఎం కే సందీప్ తెలిపారు. విశాఖ-సంత్రగచ్చి స్పెషల్ ఈనెల 19, 21, 26, 28 తేదీల్లో విశాఖలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సంత్రగచ్చి చేరుకుంటుందన్నారు. అలాగే సంత్రగచ్చి-విశాఖ స్పెషల్ ఈనెల 20, 22, 27, 29 తేదీల్లో సంత్రగచ్చిలో సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు.

News June 17, 2024

విశాఖ: 30న రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ మీట్

image

పారా స్పోర్ట్సు అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 30న నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ పారా (దివ్యాంగుల) అథ్లెటిక్స్ మీట్ నిర్వహించనున్నట్టు సంఘ కార్యదర్శి రామస్వామి తెలిపారు. రన్నింగ్ , త్రోస్ , జంప్ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన అథ్లెట్లను జూలై 15 నుంచి జరిగే జాతీయ పారా అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఆసక్తి గలవారు ఈనెల 25లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News June 17, 2024

విశాఖ: సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 రికార్డు

image

సరుకు రవాణాలో ఏపీఎస్ఆర్టీసీ జోన్-1 మొదటి స్థానంలో కొనసాగుతుంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. సరుకు రవాణా ద్వారా ఈ జోన్ గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ 15వ తేదీ వరకు రూ.4.72 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఈ ఏడాది అదే కాలానికి 4.96 కోట్లు ఆర్జించినట్లు విశాఖ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ బీ.అప్పలనాయుడు తెలిపారు.

News June 17, 2024

కాకినాడ: మహిళ దారుణ హత్య

image

మహిళ దారుణహత్యకు గురైన ఘటన కాకినాడ గ్రామీణ మండలంలో జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపేటకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి 8ఏళ్ల క్రితం సీత(26)తో పెళ్లైంది. శనివారం రాత్రి అందరూ నిద్రించాక.. కరెంట్ పోయిందని సీత వేరేగదిలో నిద్రించింది. ఉదయంకల్లా హత్యకు గురైంది. భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. DSP హనుమంతరావు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News June 17, 2024

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న రాజీనామాలు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఈక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా దర్శి మండలంలో 9 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేశారు. తుమ్మెదలపాడు, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, రాజంపల్లి, సామంతపూడి, తానంచింతల, బండి వెలిగండ్ల, చందలూరు, త్రిపురసుందరీపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల నుంచి తప్పుకొన్నారు.