Andhra Pradesh

News June 16, 2024

అచ్చెన్నాయుడికి అభినందనలు: చంద్రబాబు

image

TDP రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రఅధ్యక్షుడిగా పార్టీని నడిపంచడంలో అద్భుత పనితీరు కనబరిచారంటూ కింజరాపు అచ్చెన్నాయుడుకి అభినందనలని చంద్రబాబు ప్రశంసించారు. గత ప్రభుత్వ కాలంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.

News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే

image

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పల్లా శ్రీనివాసరావు యాదవ్ టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడుగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

News June 16, 2024

విజయవాడ: నేర సమీక్షా సమావేశం నిర్వహించిన సీపీ రామకృష్ణ

image

ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులతో ఆదివారం సీపీ రామకృష్ణ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై అధికారులతో చర్చించారు. నగర వ్యాప్తంగా క్రమం తప్పకుండా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.

News June 16, 2024

బద్వేల్ – పొరుమామిళ్ళ రోడ్డులో యాక్సిడెంట్

image

బద్వేల్ – పొరుమామిళ్ళ రోడ్డులో ఇవాళ రాత్రి 7 గంటలకు రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నరసింహులు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా గాయపడిన నరసింహులు బద్వేల్ నివాసిగా గుర్తించారు.

News June 16, 2024

విజయనగరం పై శ్రీకాకుళం జట్టు విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-23 క్రికెట్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీకాకుళం-విజయనగరం జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విజయనగరం జట్టు 44.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేశారు. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 36 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి విజయం సాధించింది.

News June 16, 2024

పారాది తాత్కాలిక వంతెనపై భారీ వాహనాలకు అనుమతి

image

బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై తాత్కాలికంగా నిర్మించిన బ్రిడ్జిపై భారీ వాహనాల రాకపోకలు సాగించవచ్చని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై లోవరాజుతో కలిసి బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. భారీ వరద కారణంగా పాడైన ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన.. మరమ్మతుల అనంతరం భారీ వాహనాలకు అనుమతులిచ్చారు. కాగా.. పారాది వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చెయ్యాలని వాహనదారులు కోరుతున్నారు. 

News June 16, 2024

ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు: ఎస్పీ నయీం అస్మి

image

బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ముస్లిం సోదరులు కూడా దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి, ఎదుటివారికి సహాయం చేయాలనీ తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలన్నారు.

News June 16, 2024

హాలహర్వి: విద్యుత్ తీగలు తగిలి వివాహిత మృతి

image

హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వివరాలకు వెళ్తే ఆదివారం లక్ష్మీ అనే వివాహిత పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News June 16, 2024

ఏల్చూరులో తప్పిన పెను ప్రమాదం

image

మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఏల్చూరులోని పంట పొలాలకు మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బోల్తా పడిన ట్రాక్టర్‌ను స్థానికులు పైకి లేపారు.

News June 16, 2024

కృష్ణా: ‘సీపీఐ కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయండి’

image

సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుందని, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు కొనసాగుతాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సమావేశాలకు హాజరవుతారని, ఈ సమావేశాలు జయప్రదం చేయాలని ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.