Andhra Pradesh

News June 16, 2024

అనంతపురం మేయర్‌‌కు అరుదైన అవకాశం

image

అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీంకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 21న రష్యాలో వివిధ దేశాల మేయర్లతో జరిగే సదస్సుకు అనంతపురం మేయర్‌కు ఆహ్వానం అందింది. బ్రిక్స్ దేశాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు 50 మందికి పైగా మేయర్లు హాజరవుతారు. ఏపీ నుంచి కేవలం అనంతపురం మేయర్‌కు మాత్రమే ఆహ్వానం రావడం విశేషం.

News June 16, 2024

నెల్లూరు ప్రజల ఆశలన్నీ నారాయణపైనే..!

image

ఉమ్మడి జిల్లాలో గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు మున్సిపాల్టీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తోంది. మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మన జిల్లా వాసి నారాయణకే మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రి పదవి రావడంతో సమస్యలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి మీ పట్టణంలో సమస్యలు ఏంటో కామెంట్ చేయండి.

News June 16, 2024

కవిటి: హోరాహోరీ మ్యాచ్.. విజేత బోడర్

image

కవిటి మండలం శవసానపుట్టుగలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. కత్తివరం- బోడర్ మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో బోడర్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ అభ్యర్థి ప్రకాశ్.. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రామారావు అన్నారు.

News June 16, 2024

రాచమల్లు రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారు: ముక్తియార్

image

ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎప్పుడు సన్యాసం తీసుకుంటారని TDP నాయకుడు ముక్తియార్ ప్రశ్నించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. కొన్ని కులాల వారికి కళ్యాణ మండపాలు కట్టిస్తానని రాచమల్లు చెప్పారని ఎప్పుడు కట్టిస్తారని అడిగారు. ప్రార్థన మందిరాలకు చందాలు ప్రకటించారని, అసంపూర్తిగా ఉన్న పనులను ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

News June 16, 2024

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు: గణబాబు

image

వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టచ్‌లో ఉన్న మాట వాస్తవమే కానీ.. వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆదివారం స్పష్టం చేశారు. అద్భుతమైన పాలనను ఆంధ్ర ప్రజలు చూస్తారని ఆయన పేర్కొన్నారు. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ద్వారా చూపించేది కూటమి ప్రభుత్వం అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని అన్నారు.

News June 16, 2024

విజయనగరం: ఆశలన్నీ ఆమెపైనే..!

image

ఉమ్మడి జిల్లా నుంచి గతంలో ఇద్దరు గిరిజన శాఖమంత్రులుగా పనిచేసినప్పటకీ పలు గిరిశిఖర గ్రామాల్లో సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణికి అవకాశం రావడంతో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు. కురుపాం నియోజకవర్గంలో పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చెయ్యాలని, ఎస్.కోట, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

News June 16, 2024

కృష్ణా: అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు జగ్గప్పదొర

image

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ పోటీలలో జగ్గప్పదొర కాంస్య పతకం సాధించాడు. దీనితో జగ్గప్ప అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఫెన్సర్ జగ్గప్పదొరను, శిక్షకులు లక్ష్మి లావణ్యను ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘం సభ్యులు నాగరాజు, విజయ్ కుమార్ అభినందించారు.

News June 16, 2024

ఒంగోలు: బక్రీదు పండుగపై అడిషనల్ SP కీలక సూచనలు

image

త్యాగానికి, సత్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని సుఖ శాంతులతో జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ వేడుకలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోవుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు జిల్లాలో 18 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

News June 16, 2024

కడప: జులై 1 నుంచి LLB రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని న్యాయ కళాశాలలో చదువుతున్న LLB (3 & 5 ఇయర్స్) విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు విశ్వవిద్యాలయంలో జులై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఐదు, మూడేళ్ల LLB (రెగ్యులర్)తొలి సెమిస్టర్ పరీక్షలు 1, 3, 5, 8, 10 తేదీల్లో జరుగుతాయన్నారు. అలానే సప్లిమెంటరీ పరీక్షలు ఇదే తేదీల్లో ఉంటాయన్నారు.

News June 16, 2024

అందరికీ దోచిపెట్టారు: మంత్రి సత్యకుమార్

image

వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని వైద్యారోరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఆదివారం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఆదాయ వనరులుగా మార్చేశారని మండిపడ్డారు. YCP సానుభూతిపరులు, వాళ్లకు కావాల్సిన ఆసుపత్రులకు ప్రజాధనం దోచిపెట్టారని ఆరోపించారు.