Andhra Pradesh

News June 16, 2024

ఎమ్మెల్యే గోరంట్ల ఇంటికి మంత్రి కందుల దుర్గేశ్

image

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వారి నివాసంలో మంత్రి కందుల దుర్గేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుర్గేశ్‌ను గోరంట్ల సాదరంగా ఆహ్వానించారు. మంత్రి పదవి వచ్చినందుకు గోరంట్ల ఆయనకు అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం గోరంట్లను దుర్గేశ్ శాలువాతో సత్కరించారు.

News June 16, 2024

ప.గో.: భానుడి భగభగలు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం సాయంత్రం భారీ వర్షాలు కురవగా, ఆదివారం పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోట్ల భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. ప్రధానంగా పెంటపాడు, తాడేపల్లిగూడెం పోడూరు, ఆచంట, పెనుగొండ తదితర ప్రాంతాలలో ఎండ ధాటికి రహదారులన్ని నిర్మానుష్యంగా మారాయి.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?

News June 16, 2024

ఉరవకొండ మండలంలో సినిమా షూటింగ్ సందడి

image

ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో హిట్ మ్యాన్ అండ్ ప్రోమోస్ ప్రొడక్షన్ సినిమా యూనిట్ సందడి చేసింది. గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ పక్కన ఎంపిక చేసిన రైతు ఇంట్లో ఆదివారం షూటింగ్ ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ‘ఇంద్రప్రస్థా’ పేరుతో నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, చైతన్య కృష్ణ హీరోలుగా నటిస్తున్నారు.

News June 16, 2024

కృష్ణా: ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

కాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.20806, నం.20805 ఏపీ ఎక్స్‌ప్రెస్‌‌లు(AC) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 22 నుంచి జులై 5 వరకు విజయవాడ- బల్లార్షా- నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం- రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News June 16, 2024

తిరుమలలో చేయాల్సిన మార్పులేంటి..?

image

తన పాలనలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ధర్మారెడ్డిని తొలగించి TTD ఈవోగా శ్యామలరావును నియమించారు. సర్వ, దివ్య, బ్రేక్ దర్శన విధానాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. అన్నప్రసాదం, లడ్డూల నాణ్యతపైనా విమర్శలు ఉన్నాయి. నిరంతరం అన్నప్రసాదం అందించాలనీ కోరుతున్నారు. తిరుమలలో ఇంకా ఏమేమీ మార్పులు చేయాలో కామెంట్ చేయండి.

News June 16, 2024

ప.గో.: CM పర్యటన.. నాయకులు తరలిరావాలి: రామరాజు

image

సీఎం చంద్రబాబు నాయుడు రేపు (సోమవారం) పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా నరసాపురం పార్లమెంట్‌లోని కూటమి పార్టీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలవరంలో ప్రాజెక్ట్‌ని సందర్శిస్తారని అన్నారు.

News June 16, 2024

అన్నమయ్య: భార్య అలిగి వెళ్లిందని పురుగుమందు తాగిన భర్త

image

భార్య అలిగి వెళ్లిందని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పీటీఎం మండలం, కందుకూరు పంచాయతీ, అగ్రహారానికి చెందిన శంకర(48)తో భార్య లక్ష్మి గొడవపడి వారం క్రితం అలిగి పుట్టినింటికి వెళ్లింది. తిరిగి కాపురానికి రాలేదని తీవ్ర మనస్తాపం చెందిన శంకర ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లెకు తరలించారు.

News June 16, 2024

చీరాల: సముద్ర తీరంలో విద్యార్థి గల్లంతు

image

చీరాల మండలం వాడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. నూజివీడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ కోసూరి కార్తీక్ (19), మైలవరపు కేదారేశ్వరరావు (19) అలల ధాటికి గల్లంతయ్యారు. మెరైన్ పోలీసుల సాయంతో కేదారేశ్వరరావును కాపాడగలిగారు. కార్తీక్ కోసం గాలిస్తున్నారు.

News June 16, 2024

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోండి: ఎస్పీ

image

మత సామరస్యానికి ప్రతిగా నిలిచే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, మదర్సాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

News June 16, 2024

శ్రీకాకుళం: ఫార్మసీ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని బీ-ఫార్మసీ నాలుగో ఏడాది 2వ సెమిస్టర్(2017- 18 రెగ్యులేషన్) థియరీ పరీక్షలను జూలై 25 నుంచి నిర్వహించనున్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 1 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు ప్రాజెక్టు వర్క్ నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ వివరాలకు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.