Andhra Pradesh

News June 16, 2024

VZM: ఈ చలానాల రూపంలో రూ.48,015 జరిమానా

image

విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. మోటార్ వెహికల్ నిబంధనలను అతిక్రమించిన వారిపై మొత్తం రూ.48,015 ఈ చలనా రూపంలో విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 8 కేసులు నమోదు చేయగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై 21 కేసులు నమోదు చేశామన్నారు.

News June 16, 2024

నెల్లూరు: వేటకు బయల్దేరిన గంగపుత్రులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12 మండలాల్లో 169 కి.మీ. మేర సముద్ర తీరం వెంబడి దాదాపు 98 గ్రామాల్లో సుమారు 1.50 లక్షల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 41 వేల మంది చేపలవేటనే జీవనం మార్చుకుని జీవిస్తున్నారు. ఏటా దాదాపు 65 వేల టన్నుల మత్స్య సంపదను సముద్రం నుంచి సేకరిస్తున్నారు. వేట నిషేధకాలం ముగియడంతో 61 రోజుల తరువాత తెల్లవారు జామున మత్స్యకార గ్రామాల నుంచి పడవలు చేపల వేటకు బయలుదేరాయి.

News June 16, 2024

18న యోగా పోటీలు: అవినాశ్ శెట్టి

image

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 18న కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలోని యోగా హాలులో జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. 8-10 ఏళ్ల వయసు, 10-12, 12-14, 14-16, 16-18 ఏళ్ల వయసు వారికి విభాగాల వారీగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9247400100 ఫోన్ నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.

News June 16, 2024

చిత్తూరు: రేపు జంతు బలి నిషేధం: కలెక్టర్

image

సోమవారం చిత్తూరు జిల్లాలో జంతుబలులు నిషేధం ఉందని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. ఆయన అధికారులతో, ముస్లిం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. కాగా నగరంలోని రెడ్డిగుంట, మురకంబట్టు ప్రాంతాలలో మేకపోతు, పొట్టేళ్ల వ్యాపారం అధికంగా జరిగింది.

News June 16, 2024

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

కొత్తవలస మండలం అడ్డూరివానిపాలెం వద్ద శనివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎల్.కోట మండలం మళ్లీవీడు గ్రామానికి చెందిన లంక జయమ్మ (60) తలకి తీవ్ర గాయమై మరణించింది. ప్రమాదం జరిగిన వెంటనే కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. పెద్దిరెడ్డి లక్ష్మి, వీ.నిర్మల, కర్రీ సత్యనారాయణ, కర్రీ మంగమ్మ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 16, 2024

పేరెంట్స్ చంపాలని చూస్తున్నారంటూ యువతి ఆవేదన

image

లవ్ మ్యారేజ్ చేసుకున్నాననే కోపంతో తల్లిదండ్రులు తనను చంపాలని చూస్తున్నారని, రక్షణ కల్పించాలని రాజమండ్రికి చెందిన యువతి విజయవాడలో ఓ న్యాయవాదిని ఆశ్రయించింది. Jan 9న మైనార్టీ తీరడంతో తాము పెళ్లి చేసుకున్నామని, తల్లిదండ్రులు దీనిపై బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తనతో పాటు భర్త, అత్తమామలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ హోంశాఖ మంత్రి, డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపింది.

News June 16, 2024

ఇక నా పయనం జగన్‌తోనే: రెడ్యం వెంకట సుబ్బారెడ్డి

image

వైఎస్ జగన్‌పై టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన విషపూరిత వ్యాఖ్యలు టీడీపీ నీచ రాజకీయానికి, బలహీనతకు ప్రత్యక్ష నిదర్శమని వైసీపీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తాను ఎప్పుడు జగన్  వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదన్నారు. 

News June 16, 2024

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో క్షుద్ర పూజలు?

image

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డు సమీపాన నిమ్మకాయలు, రంగు దారాలు, పసుపు, కుంకుమ చల్లి క్షుద్ర పూజలు నిర్వహించారు. విషయం తెలిసి ఆసుపత్రి సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. రోగులకు నయం కావాలని పూజలు చేశారా?, వ్యాధి నయమై ఇంటికెళ్లే సమయంలో చేశారా? లేక నిజంగానే క్షుద్ర పూజలు చేశారా? అనేది తెలియాల్సి ఉంది.

News June 16, 2024

పార్వతీపురం: వాహనాల దారి మళ్లింపు చర్యలు

image

బొబ్బిలి మండలం పారాది కాజ్వే పై వరద నీరు చేరడంతో దెబ్బతిన్నదని రాయగడ, పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాల దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు పట్టణ సీఐ కృష్ణారావు తెలిపారు. రాయగడ నుంచి వచ్చే వాహనాలు పాలకొండ రాజాం మీదుగా విజయనగరం వెళ్తాయని ఆయన తెలిపారు. పార్వతీపురం ఫ్లైఓవర్‌‌‌పైన దారి మళ్లింపునకు సంబంధించి బారికేడ్లు వేశారు.

News June 16, 2024

విజయవాడ: ‘బాబాయ్ అంటూ ఇల్లు మొత్తం దోచేశారు’

image

ఎనికేపాడు నివాసి అయిన పెరూరి సత్యనారాయణ (68), గోవిందమ్మ దంపతులపై శుక్రవారం రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. వారు నిర్వహిస్తున్న కిరాణా షాపుకి వచ్చిన ఒక వ్యక్తి బాబాయ్ అంటూ మాట కలిపి షాపు షటర్ దింపి మరొక ఇద్దరితో కలసి వారిద్దరి చేతులు కట్టేసి రూ.1.80 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం దోచేశారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.