Andhra Pradesh

News June 16, 2024

సింహాచలం: నేటి నుంచి మూడో విడత చందనం అరగదీత

image

వరాహాలక్ష్మీనృసింహస్వామికి పైపూతగా వేసేందుకు మూడో విడత చందనం అరగదీత ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏటా పన్నెండు మణుగుల శ్రీచందన ముద్దను నాలుగు విడతలుగా స్వామి వారికి సమర్పించడం ఆనవాయితి. తొలి విడతగా వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అనగా చందన యాత్ర నాటి రాత్రి, రెండవ విడతగా వైశాఖ మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు మూడేసి మణుగుల (125 కిలోలు) చొప్పున చందనం సమర్పించారు. మూడో విడత చందనం ఈ నెల 22న సమర్పిస్తారు.

News June 16, 2024

విజయవాడ: బ్యాటరీని మింగిన చిన్నారి.. సేఫ్

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.

News June 16, 2024

ప్రకాశం: తండ్రి కోసం విగ్రహం కట్టించిన కుమారులు

image

కన్న తండ్రికి కుమారులు ఏకంగా గుడి కట్టిన ఘటన సీఎస్‌పురం మండలం కొండ్రాజుపల్లిలో జరిగింది. మట్లే బోడెయ్య, కొండమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. బోడెయ్య వ్యవసాయం చేసి కుమారులను చదివించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు మాలకొండలరావు రైల్వేలో, చిన్న కుమారుడు సచివాలయంలో పని చేస్తున్నారు. ఈ క్రమంలో 2021లో బోడెయ్య మృతి చెందగా.. కుమారులిద్దరు తమ పొలంలో బోడెయ్యకు గుర్తుగా గుడి కట్టి ఆయన విగ్రహాన్ని అందులో ఉంచారు.

News June 16, 2024

VZM: ఈ నెల 19 నుంచి ఐటీఐ కౌన్సెలింగ్

image

విజయనగరం జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు ఐటీఐ కౌన్సిలింగ్ ఉంటుందని జిల్లా ఐటీఐ కన్వీనర్ టీ.వీ.గిరి ఆదివారం తెలిపారు. కౌన్సెలింగ్‌కు అప్లై చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకొని విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కలశాలకు హాజరు కావలసిందిగా కోరారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ర్యాంక్, హాజరుకావాల్సిన తేదీని మెసేజ్ రూపంలో పంపిస్తామన్నారు.

News June 16, 2024

స్పందన పేరు మారింది: కలెక్టర్ నాగలక్ష్మి

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రిసల్ సిస్టమ్‌గా పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. పేరు మార్పు చేసినా కార్యక్రమం తీరు అదే. అధికారులు ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తారు.

News June 16, 2024

ఒంటరితనంతో అన్నదమ్ముల ఆత్మహత్య.. ఇద్దరూ విద్యావంతులే

image

రాజమండ్రిలో <<13444701>>వంతెనపై నుంచి <<>>దూకి అన్నదమ్ములు ఆత్మహత్య చేసుకున్నారు. సాయికృష్ణానగర్‌కు చెందిన నాగేంద్రసాయి-త్రిపురదేవీ దంపతులకు నాగాంజనేయ(42), దుర్గారావు(40) సంతానం. బీటెక్, MBA చేసిన వీరు HYD, బెంగళూరులో జాబ్స్ చేశారు. 2013లో తండ్రి చనిపోగా ఇంటికొచ్చారు. 2020లో తల్లి మృతి చెందినప్పటి నుంచి ఎవరితో మాట్లాడేవారు కాదు. ఆర్థిక ఇక్కట్లు, ఒంటరితనం, పెళ్లిళ్లు కాక సంఘర్షణలోనై శనివారం సూసైడ్ చేసుకున్నారు.

News June 16, 2024

చిత్తూరు: ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న దాడి

image

ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న కర్రతో దాడిచేసిన ఘటన నిమ్మనపల్లెలో జరిగింది. SI లోకేష్ రెడ్డి కథనం.. మండలంలోని పారేసువారిపల్లెకు చెందిన రామకృష్ణ, అతని చెల్లి మనోహర్ భార్య రమాదేవి(40) అదే గ్రామంలో ఉంటుంది. తల్లిదండ్రులు పసుపు కుంకుమకు ఇచ్చిన 2 ఎకరాలను తనకు ఇవ్వాలని శనివారం రాత్రి రమాదేవి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రామకృష్ణ తన చెల్లెలుపై కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరచగా ఆస్పత్రికి తరలించారు

News June 16, 2024

హోంశాఖ, పాయకరావుపేట రెండుకళ్లు: అనిత

image

హోంశాఖ, పాయకరావుపేటను రెండుకళ్లుగా భావిస్తూ సమ ప్రాధాన్యత ఇస్తానని మంత్రి అనిత అన్నారు. వారంలో 3 రోజులు నియోజకవర్గంలోనే ఉంటానని, మిగతా రోజులు హోంశాఖకు కేటాయిస్తానన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా పేటను మార్చుతానన్నారు. ప్రజలకు పోలీసులను దగ్గర చేస్తానని, దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ని అరికడతామన్నారు.

News June 16, 2024

చేజెర్ల: అటవీ భూములు ఖాళీ చేయాలి

image

చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి కూడలిలో పెంచలకోన రహదారి వెంట అటవీ భూములు ఆక్రమించిన వారు వెంటనే ఖాళీ చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. ఆక్రమించిన అటవీ భూముల నుంచి నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు ఆక్రమణదారులకు సూచించారు. వైదొలగని ప్రదేశాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. రెవెన్యూ, అటవీ శాఖతో సర్వే జరిపి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.

News June 16, 2024

ప.గో: బ్యాటరీని మింగిలిన చిన్నారి.. సేఫ్

image

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.