Andhra Pradesh

News September 27, 2024

దెందులూరు: వినాయకుడి నిమజ్జనంలో అపశ్రుతి

image

దెందులూరు మండలం చల్ల చింతలపూడిలో గురువారం రాత్రి విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పురస్కరించుకొని విగ్రహ నిమజ్జనంలో గ్రామానికి చెందిన సింహాద్రి అయ్యప్ప(28) పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు స్థానిక చెరువులో గల్లంతయ్యాడు. వెలికి తీసిన తోటి వారు హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.

News September 27, 2024

తూ.గో జిల్లాలో చిరుత కోసం వేట

image

కడియపులంకలో చిరుత సంచారం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. చిరుతను బంధించేందుకు వారు రేయిపగలు శ్రమిస్తున్నారు.లంకల వైపు వెళ్లిన చిరుత బుధవారం పడ్డ వర్షానికి తిరిగి వెనక్కి కడియపులంకకు వచ్చేసినట్లు పాదముద్రల ఆధారంగా డీఎఫ్‌‌‌‌వోలు తెలిపారు. దానికోసం 60 మంది సిబ్బంది, 2బోన్లు,10 మేకలు సిద్ధంగా ఉంచామన్నారు. అయితే గురువారం గుర్తించిన మేరకు ఓ నర్సరీ షెడ్డు వద్ద కుక్కలను తరిమినట్లు గుర్తించామన్నారు.

News September 27, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐదుగురు తహశీల్దార్లకు బదిలీ

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో ఐదుగురు తహశీల్దారులకు బదిలీ జరిగింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మనాభం తహశీల్దార్ ఎం.ఆనంద్ కుమార్‌ను పెందుర్తికి, పెందుర్తి తహశీల్దార్ కే.వేణుగోపాల్‌ను VMRDAకి, అక్కడ పనిచేస్తున్న కే.ఆనందరావును పద్మనాభంకు బదిలీ చేశారు. సబ్బవరం తహశీల్దార్ రవికుమార్‌ను అల్లూరి జిల్లాకు, కలెక్టరేట్ నుంచి చిన్నికృష్ణను అనకాపల్లికి బదిలీ చేశారు.

News September 27, 2024

రేపు క్రోసూరులో జాబ్ మేళా.. రూ.30వేల వరకు జీతం

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 5కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో.. రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. పది, డిగ్రీ, డిప్లమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి.. 18-35ఏళ్లు ఉన్నవారు అర్హులు. SHARE IT.

News September 27, 2024

VZM: అభిమానులతో మంత్రి లోకేశ్ ఫొటోలు

image

డెంకాడ మండలంలోని జాతీయ రహదారిపైనున్న నాతవలస టోల్‌ గేట్‌ వద్ద సిబ్బందితో మంత్రి నారా లోకేశ్ గురువారం సందడి చేశారు. శ్రీకాకుళం నుంచి విశాఖ రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో టోల్‌ గేట్‌ వద్ద కాసేపు ఆగి కార్యకర్తలు, అభిమానుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా టోల్ గేట్ సిబ్బంది లోకేశ్‌తో సెల్ఫీలు తీసుకున్నారు.

News September 27, 2024

విశాఖలో NTR ఫ్యాన్స్ నిరసన

image

విశాఖ సంగం-శరత్ థియేటర్ వద్ద NTR నటించిన ‘దేవర’చిత్రం విడుదల సందర్భంగా డీజే ఏర్పాటుపై పోలీసులకు ఫ్యాన్స్‌కు మధ్య గురువారం రాత్రి వాగ్వివాదం జరిగింది. థియేటర్ వద్ద డీజే ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఫ్యాన్స్ నిరసనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డీజే ఏర్పాటుకు పోలీసు అధికారులు అనుమతి ఇచ్చారు.

News September 27, 2024

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24 వరకు ఆంక్షలు

image

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చినట్లు నాయుడుపేట DSP చెంచు బాబు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 27, 2024

ములకలచెరువు: తల్లిని చంపిన కొడుకు, కోడలు అరెస్ట్

image

ములకలచెరువులో ఆదివారం రాత్రి సఫియాభేగంను కత్తితో గొంతు కోసి హత్యచేసిన కేసులో మృతురాలి కొడుకు చిన్నరెడ్డిబాషా, కోడలు ఆషియాను గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు సీఐ రాజారమేశ్ తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. లేట్ హైదరవల్లి భార్య సఫియాబేగంతో ఆమె చిన్నకొడుకు, కోడలు ఆస్తికోసం గొడవపడి మిద్దిపైన నిద్రిస్తున్న సఫియా బేగంను పథకం ప్రకారం కత్తితో గొంతుకోసి చంపినట్లు విచారణలో తేలడంతో నిందితులను అరెస్టు చేశామన్నారు.

News September 27, 2024

అనంతపురం మార్కెట్‌లో కిలో టమాటా రూ.46

image

అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.46 పలికింది. నిన్న మార్కెట్‌కు 1650 టన్నులు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రామ్ ప్రసాద్ తెలిపారు. అందులో సరాసరి కిలో రూ.37, కనిష్ఠంగా రూ.27 పలికినట్లు పేర్కొన్నారు. వరదలతో ఇతర ప్రాంతాల్లో పంట దెబ్బ తినడంతో వారం రోజులుగా ధరలు నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 27, 2024

ఎంఎస్ఎంఈల అవగాహన సదస్సులో చిత్తూరు ఎంపీ

image

సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ డీఅర్డీఏ సమావేశ మందిరంలో పీఎంఈజీపీ పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ , అధికారులు పాల్గొన్నారు.