Andhra Pradesh

News June 16, 2024

మక్కువ: భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త సూసైడ్

image

మక్కువ మం. వెంకట భైరిపురానికి చెందిన ఓ వ్యక్తి భార్య డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈశ్వరరావు (37) మద్యానికి బానిసై భార్యను తరచూ డబ్బులు అడిగేవాడు. ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించేవాడు. ఈ నెల 8న భార్యను డబ్బులు అడగగా.. ఆమె లేవని చెప్పింది. దీంతో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు.

News June 16, 2024

అనంత: భార్యపై అనుమానంతో కత్తితో భర్త దాడి

image

అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని పాతకోటకు చెందిన దాదాపీర్.. అనుమానంతో భార్య రమీజాను అర్ధరాత్రి కత్తితో గొంతు కోశాడు. ఆమెను స్థానికులు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అనంతపురానికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరికి వివాహం జరిగి కేవలం 5 నెలలు అయినట్లు తెలుస్తోంది.

News June 16, 2024

విశాఖ: నేడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష

image

విశాఖ జిల్లాలో ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రెండవ సెషన్ పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 9,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

News June 16, 2024

కర్నూలు: హాకీ ఎంపిక పోటీలు

image

ఈ నెల 23న ఉమ్మడి జిల్లాల హాకీ ఎంపిక పోటీలు నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి దాసరి సుధీర్ శనివారం తెలిపారు. 1.1.1995 తర్వాత జన్మించినవారు అర్హులన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు ధర్మవరంలో జరిగే 14వ సీనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.

News June 16, 2024

పామర్రు మాజీ MLA టీడీపీలో చేరడంలేదు.!

image

పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ టీడీపీలో చేరుతున్నారంటూ శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేశాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ శనివారం విస్తృతంగా ఆ వార్త చక్కర్లు కొట్టింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రతినిధులు స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి చేరేది లేదంటూ అవన్నీ తప్పుడు కథనాలని తెలిపారు.

News June 16, 2024

రామకుప్పం: ఏనుగు దాడిలో రైతు మృతి

image

రామకుప్పం మండల పరిధిలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. మండల పరిధిలోని పీఎంకే తాండ వద్ద రైతు కన్నా నాయక్ (50) పై ఒంటరి ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది. దిగువ తాండ నుంచి పీఎంకే తండాకు వెళ్తున్న రైతు కన్నా నాయక్‌పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగుల దాడుల నియంత్రణలో ఫారెస్ట్ అధికారులకు పూర్తిగా విఫలమయ్యారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

News June 16, 2024

గుడ్లూరు: అనుమానాస్పదంగా వృద్ధుడు దారుణ హత్య

image

గుడ్లూరు మండలం నరసాపురం- కొత్తపల్లి గ్రామాల రహదారిలోని అటవీ ప్రాంతంలో నరసాపురానికి చెందిన గిరిజన వృద్ధుడు తలపల రమణయ్య (60) దారుణ హత్యకు గురైన విషయం ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కాళ్లు చేతులు కట్టివేసి రమణయ్యను దారుణంగా దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న గుడ్లూరు పోలీసులు ఆ ప్రాంతాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News June 16, 2024

ఈనెల 17న పలు రైళ్లు రద్దు

image

రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతులు కారణంగా ఈ నెల 17వ తేదీన పలు రైళ్లు అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లను కూడా రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సందర్భంగా వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

News June 16, 2024

రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు CM చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత CMగా ఆయన సందర్శించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 9.30 గంటలకే ఆయన పోలవరం చేరుకొని అంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడే ప్రాజెక్ట్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

News June 16, 2024

రేపు పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలనకు CM చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నట్లు MLA చిర్రి బాలరాజు తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత CMగా ఆయన సందర్శించే తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం 9.30 గంటలకే ఆయన పోలవరం చేరుకొని అంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడే ప్రాజెక్ట్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.