Andhra Pradesh

News June 16, 2024

నెల్లూరు: వైసీపీ నేతలపై వాలంటీర్లు ఫిర్యాదు

image

నెల్లూరు రూరల్ 41వ డివిజన్ కు చెందిన పలువురు వాలంటీర్లు వైసీపీ నేతలపై శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ముందు తమ చేత స్థానిక కార్పొరేటర్, వైసీపీ నేతలు బలవంతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి రాజీనామా చేయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని ఈ అంశంలో సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 16, 2024

బీటెక్, ఫార్మా-డీ పరీక్షా ఫలితాల విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు కేశవరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు ఫార్మా-డీ 5వ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని వెల్లడించారు.

News June 16, 2024

అచ్చుతాపురం: అప్పు తీర్చేందుకు ఆలయంలో చోరీ

image

జల్సాలకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చడానికి ఇద్దరు యువకులు అమ్మవారి గుడిలో చోరీకి పాల్పడిన సంఘటన జీ.ధర్మవరంలో వెలుగు చూసింది. మార్టూరుకు చెందిన అభిషేక్, కిషోర్ మద్యానికి బానిసై అప్పులు చేశారు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఈనెల 9న అర్ధరాత్రి జీ.ధర్మవరం దుర్గమ్మ గుడి తలుపులు పగలగొట్టి ఐదు సీసీ కెమెరాలు, హుండీలో ఉన్న రూ.5వేలు చోరీ చేశారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News June 16, 2024

కొత్తవలస: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామని రైల్వే ఎస్.ఐ రవివర్మ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయనకు వచ్చిన సమాచారం మేరకు కొత్తవలస మండలం నిమ్మలపాలెం వద్ద రైల్వే బ్రిడ్జి కింద గుర్తు తెలియని మృతదేహన్ని పరిశీలించామన్నారు. రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉండవచ్చు అన్నారు. మృతదేహం పక్కన తాపీలు ఉన్నాయని, వ్యక్తి సమాచారం తెలిసిన వాళ్లు జీఆర్పీ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

News June 16, 2024

కమలాపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కమలాపురం మండలం చదిపిరాళ్ల వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముద్దనూరు మండలం ఒంటిగారిపల్లెకు చెందిన చింతకుంట ప్రసాద్ మృతి చెందినట్లు ఎస్సై హృషికేశ్వర్ రెడ్డి తెలిపారు. కడప నగరపాలక సంస్థలో ఉద్యోగం చేస్తున్న అతను బైక్‌పై వెళుతుండగా చదిపిరాళ్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

News June 16, 2024

చిత్తూరు: చుడా ఛైర్మన్ రాజీనామా

image

చుడా చైర్మన్ పదవికి కట్టమంచి పురుషోత్తంరెడ్డి రాజీనామా చేశారు. గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుడా ఛైర్మన్‌గా నియమించారు. పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లు పొడిగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.

News June 16, 2024

చీరాల: బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

చీరాల రామ్ నగర్ సమీపంలో శనివారం ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొనగా ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాంనగర్ వద్ద ఒక వేడుక జరుగుతుండడంతో ఒకవైపు రోడ్డుకు తాళ్లు కట్టగా రేపల్లె వెళుతున్న ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొంది. దీంతో బైకు నడుపుతున్న ఐటీసీ ఉద్యోగి బుచ్చిబాబు కిందపడగా .. తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన బుచ్చిబాబును గుంటూరుకు తరలించారు.

News June 16, 2024

కర్నూలు: రోడ్డు ప్రమాదం మృతుల వివరాలు (UPDATE)

image

ఎమ్మిగనూరులో శనివారం సాయంత్రం NH167 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరు ఎమ్మిగనూరు మండలం గుడికల్‌కి చెందిన శివ, మరొకరు నందవరం మండలం హాలహర్వికి చెందిన గురుస్వామిగా గుర్తించారు. శివ చదువుకుంటూ ఉండగా, గురుస్వామి ఓ బేకరీ షాప్‌లో పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రమాదంలో యువకుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఉండటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News June 16, 2024

ముస్లిం సోదరులు బక్రీద్ సంతోషంగా చేసుకోవాలి: ఎస్పీ

image

బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా బక్రీద్ చేసుకోవాలని కోరారు. ఆవులను ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే క్రమంలో తగిన పత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించినా, అల్లర్లు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News June 16, 2024

గుంటూరులో వ్యభిచార గృహాలపై దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మల్లారెడ్డి నగర్‌లో ఓ మహిళ తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుందని వచ్చిన సమాచారంతో, శనివారం నగరంపాలెం సీఐ మధుసూదనరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. తనిఖీల్లో అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.