Andhra Pradesh

News June 15, 2024

చిత్తూరు: 18 మందికి జరిమానా

image

చిత్తూరు పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి పదివేలు రూ.1,80,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో శుక్రవారం 18 మంది పట్టుబడినట్లు చెప్పారు. వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి ఉమాదేవి ఫైన్ విధించినట్లు తెలిపారు.

News June 15, 2024

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా చేరుతున్న వరద నీరు

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా నీరు వచ్చి చేరుతోంది. శనివారం తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి 15,131 క్యూసెక్కులు చేరాయి. అదే సమయానికి జలాశయ నీటిమట్టం 810.90 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిలువ సామర్థ్యం 34.8332 టీఎంసీలుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిస్తే అనుకున్న మేరకు నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.

News June 15, 2024

విశాఖ: 17న పలు రైళ్లను రద్దు  

image

వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు వంతెన మరమ్మతుల కారణంగా17న పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. 17న పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 17న బయలుదేరే విశాఖ-బ్రహ్మపూర్, 18న బయలుదేరే బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

News June 15, 2024

60మందికి ప్రశంసా పత్రాలను అందజేసిన సత్యసాయి ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లా పోలీస్ శాఖ యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో సమర్థవంతంగా పనిచేసిన 60 మందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు, రివార్డులను అందజేశారు.

News June 15, 2024

మంత్రి నారాయణను కలిసిన నెల్లూరు కలెక్టర్, ఎస్పీ

image

పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణను శనివారం నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చింతా రెడ్డిపాలెంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందజేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, శాంతిభద్రతలపై చర్చించారు.

News June 15, 2024

బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తా: ప్రత్తిపాటి

image

నియోజకవర్గ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి తనకు అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా అమలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఎమ్మెల్యేను నియోజకవర్గంలోని పలువురు టీడీపీ శ్రేణులు కలిసి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తానని, సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు.

News June 15, 2024

చింతకొమ్మదిన్నెలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

చింతకొమ్మదిన్నె మండలం పరిధిలోని మామిళ్ళపల్లి గ్రామం సోమయాజులపల్లి కంపచెట్ల వద్ద గుర్తుతెలియని మృతదేహం శనివారం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం ఆనవాళ్ళతో కూడిన సమాచారాన్ని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించి గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

News June 15, 2024

గిద్దలూరు: మద్యం మత్తులో రైలు కింద పడ్డాడు

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి గూడ్స్ రైలు కింద పడిన ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట రైల్వే స్టేషన్‌కి సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. నంద్యాలకు చెందిన బాష అనే వ్యక్తి, మద్యం మత్తులో గుంటూరు వైపుగా వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. 108 వాహనంలో క్షతగాత్రుడిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News June 15, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

News June 15, 2024

రేపు జిల్లాకు రానున్న మంత్రి కొండపల్లి

image

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఉదయం జిల్లాకు రానున్నారు. మంత్రి పదవి చేపట్టిన తరువాత జిల్లాకు తొలిసారిగా వస్తున్న శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆదివారం విశాఖపట్నంలో 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. పర్యటనలో భాగంగా ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు.