Andhra Pradesh

News June 15, 2024

చిత్తూరు: అక్రమంగా జంతువులను తరలిస్తే చర్యలు: కలెక్టర్

image

శాంతియుత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన చిత్తూరులో మాట్లాడారు. జిల్లా బక్రీద్ పండుగను పురస్కరించుకొని జంతువులను వధించిన, అక్రమంగా తరలించినా వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పంచాయతీ స్థాయిలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News June 15, 2024

SKLM: పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఎలా

image

పాలిటెక్నిక్ మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసింది. కళాశాలల వారీగా జరిగిన ప్రవేశాలు పరిశీలిస్తే SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 297 సీట్లకు 268, SKLM ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో 99 సీట్లకు 94, ఆమదాలవలస పాలిటెక్నిక్‌లో 132కి 127, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 118కి 98, సీతంపేటలో 108కి 31, టెక్కలి ఐతం పాలిటెక్నిక్‌లో 462కి 361, ఎచ్చెర్ల వెంకటేశ్వర 462కి 340, మందికి‌ ప్రవేశాలు జరిగాయి.

News June 15, 2024

తెనాలికి 4 దశాబ్దాల తర్వాత పౌరసరఫరాల శాఖ

image

తెనాలి శాసనసభ్యుడిగా ఎన్నికైన వారిలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అన్నాబత్తుని సత్యనారాయణ కొంతకాలం పౌరసరఫరాల మంత్రిగా పని చేశారు. తిరిగి ఇప్పుడు నాదెండ్ల మనోహర్‌కు కూడా అదే పౌర సరఫరాల శాఖను సీఎం చంద్రబాబు కేటాయించారు. తెనాలి నుంచి గెలిచి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాదెండ్లను పలువురు పట్టణ ప్రముఖులు కలిసి అభినందనలు తెలుపుతున్నారు.

News June 15, 2024

కృష్ణా: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు తెలిపాయి. రిజల్ట్స్ కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News June 15, 2024

దుత్తలూరు: రూ.100కు చేరువగా టమాటా

image

మార్కెట్లో లభ్యమయ్యే నాణ్యమైన మొదటి రకం టమాటా ధర సెంచరీకి దగ్గరైంది. జిల్లాలోని దాదపు అన్ని మండల కేంద్రాల్లో తృతీయ శ్రేణి టమాటాలు కిలో రూ.60 పైగానే వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కేజీ ఉల్లిగడ్డ రూ.60 పలుకుతోంది. నిత్యం వాడే కురగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఖర్చుల భారం పెరిగిపోతుందని ప్రజలు వాపోతున్నారు. ధరలు తగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News June 15, 2024

రాప్తాడు వద్ద ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

image

హిందూపురం ఆర్టీసీ డిపో బస్సుకు అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బస్సు రాంగ్ రూట్లో వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి బస్సు వాలింది. ప్రయాణికుల కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయట పడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 40మంది దాకా ప్రయాణికులు ఉన్నారు.

News June 15, 2024

నంద్యాల: చిరుత పులి మృతి

image

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని శ్రీశైలం డ్యాం సమీపంలో శనివారం చిరుత పులి మృతిచెందింది. దోమలపెంట రేంజర్ గురుప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువుల దాడిలో ఓ మగ చిరుత పులి మృతిచెందినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు.

News June 15, 2024

అద్దంకి: టీడీపీ ఫ్లెక్సీల చించివేత

image

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ మంత్రిగా కేబినెట్‌లో స్థానం లభించడంతో మండలంలోని మక్కెన వారి పాలెం ఎస్సీ కాలనీలో అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 15, 2024

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శారద బాధ్యతలు స్వీకరణ

image

కడప జడ్పీ ఛైర్మన్‌గా శారద శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఉన్న జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. దీంతో వైస్ ఛైర్మన్‌గా ఉన్న శారద పూర్తి స్థాయిలో జడ్పీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో జిల్లా ప్రగతికి చేయూతనిస్తానని ఆమె అన్నారు.

News June 15, 2024

పార్వతీపురం – రాజమండ్రి అదనపు బస్సు సర్వీసులు

image

పార్వతీపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల కోసం కొత్తగా రెండు అదనపు బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డీఎం కనకదుర్గ తెలిపారు. ఇప్పటివరకు పార్వతీపురం నుంచి విజయవాడకు మూడు అల్ట్రా డీలక్స్ బస్సులను నడుపుతున్నామని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.