Andhra Pradesh

News June 15, 2024

కడపలో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

image

కడప నగరంలోని ఒక జ్యువెలరీ షోరూమ్‌ను సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కలిసి శనివారం ప్రారంభించారు. జువెలరీ ప్రధాన రహదారికి ఇరువైపులా నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News June 15, 2024

30 తులాల బంగారు నగలు స్వాధీనం

image

అనంతపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. అయితే గంటల వ్యవధిలోనే పోలీసులు ఆ కేసును ఛేదించారు. డీఎస్పీ ప్రతాప్ అందించిన వివరాల మేరకు.. భవానీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఖాజాపీర్ 30 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

News June 15, 2024

పుట్టా గెలుపుతో తిరుమలకు పాదయాత్ర

image

మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా
పుట్టా సుధాకర యాదవ్ గెలుపొందటంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకొనేందుకు శనివారం జీవి సత్రం నుంచి టీడీపీ మండల అధ్యక్షుడు భీమయ్య ,యువ నేత కిశోర్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రామచంద్రనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

News June 15, 2024

కర్నూలు ఆర్‌యూ స్నాతకోత్సవం వాయిదా

image

కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం నాలుగో స్నాతకోత్సవం పలు కారణాలతో వాయిదా పడింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు గమనించాలని కోరారు.

News June 15, 2024

రాజమండ్రిలో ఫ్లైఓవర్ కింద 2 మృతదేహాలు

image

రాజమండ్రి సిటీలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శంభూనగర్ ఫ్లై ఓవర్ కింద శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు మృతి చెంది ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెండో పట్టణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరూ సోదరులని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News June 15, 2024

VZM: ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను బకాయిలు ఎంతంటే..

image

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ల కాలం నుంచి ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లా కలెక్టర్ కార్యాలయం రూ.2.80 కోట్లు, హౌసింగ్ డీఈ కార్యాలయం రూ.2.10 కోట్లు, తపాలా శాఖ కార్యాలయం రూ.1.13 కోట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం రూ.62.95 లక్షలు, జిల్లా కోర్టు రూ.3.93 కోట్లు రావాల్సి ఉంది. వడ్డీతో కలిపితే రెట్టింపు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

News June 15, 2024

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 2,795 మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8500292992కు సంప్రదించాలన్నారు.

News June 15, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 64 మంది ఎంపిక

image

నిరుద్యోగులకు ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి దీప్తి పేర్కొన్నారు. సీ.క్యాంపులోని కార్యాలయంలో వివిధ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించారు. ఇనోవిజన్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్, జియో టవర్స్, నవభారత్ ఫర్టిలైజర్స్, అమర్ రాజా కంపెనీల వారు హాజరయ్యారు. మొత్తం 197 మంది హాజరు కాగా.. 64 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు.

News June 15, 2024

నూజివీడు: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి

image

కృష్ణా జిల్లా నూజివీడులో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిందని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లికి చెందిన నరసింహారావు కుమార్తె వాసంతి(28)ని కాన్పు కోసం ఈనెల 12న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. డెలివరీ చేసేందుకు 13న ఆసుపత్రి సిబ్బంది వాసంతిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లగా ఆమె మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 15, 2024

మంత్రి నారాయ‌ణ‌ను క‌లిసిన క‌లెక్ట‌ర్‌, ఎస్పీ

image

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణను శనివారం ఉదయం నెల్లూరు మంత్రి నివాసంలో జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ్‌, ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. పుష్ప‌ గుచ్ఛాలు అంద‌జేసి జ‌న్మ‌దిన శుభాకంక్షలు తెలియ‌జేశారు. అనంతరం వారు కొంత సేపు జిల్లా అభివృద్ధి, శాంతిభ‌ద్ర‌త‌లు ఇతర అంశాల విషయాలపై చర్చించుకున్నారు.