Andhra Pradesh

News June 15, 2024

మంత్రి నారాయ‌ణ‌ను క‌లిసిన క‌లెక్ట‌ర్‌, ఎస్పీ

image

రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణను శనివారం ఉదయం నెల్లూరు మంత్రి నివాసంలో జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ్‌, ఎస్పీ ఆరీఫ్ హ‌ఫీజ్ లు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. పుష్ప‌ గుచ్ఛాలు అంద‌జేసి జ‌న్మ‌దిన శుభాకంక్షలు తెలియ‌జేశారు. అనంతరం వారు కొంత సేపు జిల్లా అభివృద్ధి, శాంతిభ‌ద్ర‌త‌లు ఇతర అంశాల విషయాలపై చర్చించుకున్నారు.

News June 15, 2024

అనంత: బస్సు ఢీకొని రైతు మృతి

image

గుమ్మఘట్ట మండలం క్రిష్ణాపురానికి చెందిన రైతు మంజునాథ(55) శుక్రవారం రాత్రి బస్సు ఢీకొని మృతిచెందారు. మంజునాథ సాగుచేసే దానిమ్మ పంటకు మందులు తెచ్చేందుకు బైక్‌పై కర్ణాటక వెళ్లారు. తిరిగి స్వగ్రామం వస్తుండగా కర్ణాటక ప్రాంతం హనుమంతపల్లి క్రాస్ వద్ద బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతిచెందారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News June 15, 2024

అంతర్వేదిలో హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

News June 15, 2024

అంతర్వేదిలో హోంమంత్రి వంగలపూడి అనిత పూజలు

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన హోం మంత్రి అనితకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. ఈవో సత్యనారాయణ మంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

News June 15, 2024

VZM: జిల్లాలో 201 మందికి చలానా

image

విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి జరిగిన వాహనాల తనిఖీల్లో 201 మందిపై రూ43,450లను ఈ చలానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 5 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో  మద్యం తాగిన వారిపై 26 కేసులు నమోదు చేశామని తెలిపారు.

News June 15, 2024

నెల్లూరు: ఆరు తలల తాటి చెట్టు

image

అల్లూరు మండలంలోని గోగులపల్లి వద్ద ఆరు తలల తాటి చెట్టు ఉంది. చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆ తాటి చెట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తాటి చెట్టును ఎప్పుడూ చూడలేదని అన్నారు.

News June 15, 2024

విజయవాడ: రేపే UPSC పరీక్ష .. ఏర్పాట్లు పూర్తి

image

ఈ నెల 16వ తేది ఆదివారం UPSC పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..నగరంలోని 25పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. విజయవాడలోని పరీక్షా కేంద్రంలో మెత్తం 11,112మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9.30నుంచి 11.30గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30నుంచి 4.30వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు.

News June 15, 2024

బాపట్ల: ఈనెల 21 వరకు రైల్వే గేట్ మూసివేత

image

బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలోని పూల మార్కెట్ వద్ద గల రైల్వే గేట్ ఈనెల 21 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మతుల నిమిత్తం నేటి నుంచి 21వ తేదీ వరకు రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్టువర్టుపురం గేటు నుంచి రాకపోకలు సాగించాలని సూచించారు.

News June 15, 2024

ఏయూ వీసీపై చర్యలు తప్పవు: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

image

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి. మహేశ్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఏయూలో అరాచక పాలనకు ముగింపు పలుకుతామన్నారు. ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏయూ వీసీ 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించారని అన్నారు.

News June 15, 2024

కడప: నిరుద్యోగ యువతకు ట్యాలీలో ఉచిత శిక్షణ

image

ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫౌండేషన్ అడ్మిషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ లేదా ఫెయిల్ అయిన 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు అర్హులని తెలిపారు. 35 రోజుల శిక్షణా కాలంలో కంప్యూటర్ స్కిల్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతామన్నారు.