Andhra Pradesh

News June 15, 2024

గొట్టిపాటి రవికుమార్ పర్యటనలో జేబు దొంగల చేతివాటం

image

విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం అద్దంకి పట్టణానికి తొలిసారి రావటంతో పాతబస్టాండ్ సెంటర్‌లో రద్దీ ఏర్పడింది. ఇందులో జేబుదొంగలు చేతివాటం చూపించారు. సుమారు 10 మంది వద్ద నుంచి రూ.15 లక్షల వరకు కాజేసినట్లు ఆరోపించారు. అయితే స్థానికులు ఓ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను దర్శికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు.

News June 15, 2024

విశాఖ: 28న 100వ తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.

News June 15, 2024

విజయవాడ నుంచి ముంబయికి విమాన సర్వీసు ప్రారంభం

image

గన్నవరం విమానాశ్రయం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభంకానుంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని చిన్ని ప్రారంభించనున్నారు. శనివారం సాయంత్రం 5.15 గంటలకు ముంబయి నుంచి విజయవాడకు ఎయిరిండియా విమానం రానుంది. టికెట్‌ ప్రారంభ ధర రూ.5,600గా నిర్ణయించడంతో డిమాండ్ ఏర్పడింది. ప్రతి రోజూ రాత్రి 7.10 గంటలకు ఈ సర్వీసు విజయవాడ నుంచి బయలుదేరుతోందని తెలిపారు.

News June 15, 2024

హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమతం: జిల్లా మలేరియా అధికారి

image

హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి.జగన్మోహన్‌రావు అన్నారు. జోగంపేట ఎస్ఓఈ వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించి వాడుక నీరు, వర్షం నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలన్నారు.

News June 15, 2024

ANU: నేడు ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నేడు అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆధార్ కార్డు, ఇంటర్ మెమో మార్కుల జాబితా తీసుకొని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి అధికారి అనుమతితో రూ. 1200 చెల్లించి పరీక్ష రాయవచ్చని చెప్పారు.

News June 15, 2024

కె.వి పల్లి: గురుకులంలో ఉద్యోగ అవకాశాలు

image

కేవీ పల్లి మండలంలోని గ్యారంపల్లె గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, ఆంగ్లంలో బోధించేందుకు తాత్కాలిక అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చెన్నకేశవులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపల్ ను సంప్రదించాలని కోరారు.

News June 15, 2024

శ్రీకాకుళం: చెట్టు విరిగిపడి వ్యక్తి మృతి

image

జి. సిగడాం మండలంలోని పెనసాంలో ఈదురు గాలులకు చెట్టు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన గేదెల రమణ (39) పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తుండగా చెట్టు విరిగి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతనికి భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ఉన్నారు. ఎస్సై మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 15, 2024

మైనర్లకు పెళ్లి.. బాలిక తల్లిదండ్రుల అరెస్ట్

image

బాలికకు పెళ్లి చేసిన తల్లిదండ్రులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారుకు చెందిన బాలుడు, బాలిక ప్రేమించుకున్నారు. బాలిక గర్భం దాల్చడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ గతేడాది Aug 26న వారికి పెళ్లి చేసేందుకు నిర్ణయించగా అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. ఆ తర్వాత మూడ్రోజులకే వారికి పెళ్లి చేయగా.. SP ఆదేశాల మేరకు బాలిక పేరెంట్స్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు.

News June 15, 2024

పరవాడ: చేపల వేటకు సిద్ధం అవుతున్న మత్స్యకారులు

image

చేపల వేట నిషేధం గడువు జూన్ 15వ తేదీ అర్ధరాత్రితో ముగుస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధం అవుతున్నారు. 61 రోజుల చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులు చినిగిన వలలు, పాడైన పడవలకు మరమ్మతులు చేసుకున్నారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం జాలరిపేట మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. పరవాడ మండలంలో 120 పడవల ద్వారా మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ ఉంటారు.

News June 15, 2024

అనంత: రానున్న ఐదు రోజుల్లో వర్షాలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి పేర్కొన్నారు. వచ్చే 5 రోజుల్లో పగలు ఉష్ణోగ్రత 32.4 నుంచి 34.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 23.8 నుంచి 24.7 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.