Andhra Pradesh

News June 15, 2024

రాజంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రాజంపేట మండలం హస్తవరం- రాజంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శుక్రవారం రేణిగుంట పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియా సిమెంటు అని బనియన్ దానిపై గ్రీన్ కలర్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. ఎవరనేది సమాచారం తమకు తెలపాలని కోరారు. కేసు నమోదు చేశామని తెలిపారు.

News June 15, 2024

రాజమండ్రిలో ‘స్పా’ ముసుగులో వ్యభిచారం

image

రాజమండ్రిలో ‘స్పా’ కేంద్రం ముసుగులో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో తూ.గో జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. ఏవీ అప్పారావు రోడ్డులో జిమ్, స్పా కేంద్రం నిర్వహిస్తున్నారు. అందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులతో పాటు సిబ్బందిగా ఉన్న మరో యువతిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News June 15, 2024

ఆత్మకూరు: ఉపాధ్యాయ ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆత్మకూరు పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కామేశ్వరి తెలిపారు. ఇంగ్లీష్ టిజిటి, పిజిటి, ఫిజిక్స్ పిజిటి, హిందీ పిజిటి, టిజిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు గడువును 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. పూర్తి వివరాలకు పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.

News June 15, 2024

చీమకుర్తి: దివ్యాంగురాలిపై 3 నెలలుగా అత్యాచారం

image

చీమకుర్తి మండల పరిధిలోని చండ్రపాడులో మాటలు రాని, వినపడని యువతిపై మూడు నెలలుగా అఘాయిత్యం జరుగుతున్నట్లు బయటపడింది. ఆ యువతి గర్భిణీ అని తేలటంతో శుక్రవారం ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.

News June 15, 2024

ఆగస్టులో టీటీసీ థియరీ పరీక్షలు: ఎన్. ప్రేమకుమార్

image

ఆగస్టులో జరగనున్న టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జూలై ఒకటో తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఆలస్యమైతే రూ.50 అపరాధ రుసుముతో జూలై ఆరో తేదీలోగా చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు గమనించాలని సూచించారు.

News June 15, 2024

ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు సికింద్రాబాద్- కాకినాడ టౌన్ (ట్రైన్ నెం. 07135) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే(SCR) పేర్కొంది. ఈ నెల 21, 22వ తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 7 గంటలకు బయలుదేరే ఈ ట్రైన్ తర్వాతి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్ చేరుతుందని, ఈ రైలు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.

News June 15, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

image

నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ప్రతిపక్ష హోదాలో టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ శాఖ మన జిల్లా మంత్రికి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 15, 2024

శ్రీకాకుళం: ప్రారంభమైన పాలిటెక్నిక్ క్లాస్ వర్క్

image

పాలిటెక్నిక్ మొదటి ఏడాది క్లాస్ వర్క్ ప్రారంభమైంది. పాలీసెట్ 2024 సీట్లు అలాట్మెంట్‌ను షెడ్యూల్ మేరకు ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో సీట్లు లభించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్‌లో కళాశాలలు, బ్రాంచ్‌లు మార్చుకోవచ్చని శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్ ఇన్‌ఛార్జ్ దామోదర్ రావు తెలిపారు.

News June 15, 2024

తాడిపత్రిలో వృద్ధుడిని ఢీకొట్టిన గూడ్స్ రైలు

image

తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే ఎస్సై నాగప్ప తెలిపిన వివరాల మేరకు.. రాజంపేటకు చెందిన యల్లయ్య తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద మూత్రవిసర్జన చేస్తున్నారు. ఆ సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. గమనించిన స్థానికులు యల్లయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తీసుకెళ్లారు.

News June 15, 2024

దర్శి: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థులు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన దర్శిలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దర్శి మండలం లంకోజినపల్లికి చెందిన నవీన్‌ (16), చందు (16)లు గురువారం ఇద్దరూ బయటకు వెళ్లారు. తర్వాత వీరిద్దరూ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. శుక్రవారం ఉదయం దర్శిలోని ఎన్‌ఎపీ చెరువులో మృతదేహాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.