Andhra Pradesh

News June 15, 2024

నేడు ఉపాధిహామీ పనులను పరిశీలించనున్న అనంత కలెక్టర్

image

కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలైన శెట్టూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం మండలాల్లో శనివారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించనున్నారు. పైన తెలిపిన మండలాల్లో జరిగిన పలు రకాల ఉపాధిహామీ పనుల నాణ్యత, అవకతవకలపై పరిశీలించనున్నారు. కావున సంబంధిత విభాగాలకు చెందిన అధికారులు తప్పక హాజరు కావాలని అధికారులు తెలిపారు.

News June 15, 2024

అనంత కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న వీరన్న, హరికృష్ణ

image

అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా గుమ్మగట్ట, రాయదుర్గానికి చెందిన యువకులు అవార్డులు అందుకున్నారు. అత్యధికసార్లు రక్తదానం చేయడమేకాక విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించినందుకు గుమ్మగట్ట ఎం.జి వీరన్న, రాయదుర్గం హరికృష్ణలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ ఆవార్డులు అంజేసి అభినందించారు.

News June 15, 2024

జిల్లాలో మాతృ మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

హైరిస్క్ కేసుల్ని ముందుగానే గుర్తించి పైస్థాయి ఆసుపత్రులకు చెకప్, కాన్పుకు పంపేందుకు ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. డెలివరీ అయిన స్త్రీని కనీసం 5 రోజులు తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచాలన్నారు. హైరిస్క్ గర్భిణీలకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు 8 నుంచి 9 నెలల మధ్యలో చేయాలని చెప్పారు. మాతృ మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు.

News June 15, 2024

తూ.గో.: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబరు మార్పు

image

విశాఖపట్నం నుంచి కడప వయా తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి మీదుగా వెళ్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్‌ను రైల్వే అధికారులు మార్పు చేశారు. ప్రస్తుతం 17487/ 17488 నంబర్లపై రైలు నడుస్తుండగా, జూలై నెల 1వ తేదీ నుంచి 18521/ 18532 నంబర్లగా రైల్వే అధికారులు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పును రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు. ☛  SHARE IT

News June 15, 2024

కృష్ణా: టికెట్ రిజర్వేషన్ చేసుకునే రైలు ప్రయాణికులకు గమనిక

image

విజయవాడ మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.12503 బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు 15673 నెంబరు, నం.12504 అగర్తలా- బెంగుళూరు కంటోన్మెంట్ హమ్‌సఫర్ ట్రైన్‌కు 15674 నెంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 15, 2024

SKLM: రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నెంబర్లను మార్చినట్లు సదరన్ రైల్వే తెలిపింది. ఈ మేరకు బెంగుళూరు కంటోన్మెంట్ – అగర్తల హమ్‌సఫర్ ట్రైన్‌కు నం.12503 బదులు 15673 నెంబరు, అగర్తల- బెంగుళూరు కంటోన్మెంట్ ట్రైన్‌కు 12504 బదులు 15674 నంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఈ మేరకు తాజాగా విషయాన్ని వెల్లడించారు.

News June 15, 2024

ఏలూరు: మసీదుల వద్ద కట్టదిట్టమైన బందోబస్తు: SP

image

ఏలూరు ఈ నెల 17వ తేదీన బక్రీద్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఎస్పీ మేరీ ప్రశాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు. మతపెద్దలతో సమావేశమై మత సామరస్యాన్ని కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. పోలీసు అధికారులు ముస్లిం పెద్దలతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలన్నారు.

News June 15, 2024

తిరుపతి: 16న UPSC ప్రిలిమ్స్ పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 16న ఆదివారం UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5,518 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు.

News June 14, 2024

కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిసిన అనిత

image

సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హోమ్ మినిస్టర్‌గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. నమ్మకం నిలబెట్టుకుంటానని చంద్రబాబుకు ఈ సందర్బంగా తెలిపారు.

News June 14, 2024

తూ.గో.: రేపటి నుంచి వేట షురూ

image

చేపల సంతానోత్పత్తి, మత్స్య సంపద వృద్ధి లక్ష్యంగా సముద్రంలో 2 నెలల పాటు అమలుచేసిన చేపల వేట నిషేధం శుక్రవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో శనివారం నుంచి వేట షురూ కానుంది. ఏప్రిల్ 14 నుంచి వేట నిషేధం ప్రకటించారు. కాకినాడ జిల్లాలో తొండంగి నుంచి తాళ్ళరేవు వరకు 94 కిలోమీటర్ల మేర సాగర తీరం విస్తరించి ఉంది. జిల్లాలో 1,95,184 మంది మత్స్యకారుల్లో 36,101 మంది సముద్రంలో వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు.