Andhra Pradesh

News June 14, 2024

DSC అభ్యర్థులకు కొలికపూడి గుడ్‌ న్యూస్

image

టీడీపీ ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ పార్టీ MLA కొలికపూడి శ్రీనివాస్ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. DSCకి ప్రిపేర్ అయ్యేవారికి తిరువూరులో ఉచిత కోచింగ్ ఇస్తామని ఆయన తాజాగా తన అధికారిక FB ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ శిక్షణకు రాష్ట్రంలో ఉండే ఎవ్వరైనా రావొచ్చని కొలికపూడి చెప్పారు. కాగా గతంలో కొలికపూడి తన KS రావు అకాడమీ ద్వారా పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.

News June 14, 2024

నాడు కళా వెంకట్రావు.. నేడు అనిత

image

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతంవారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో ప్రస్తుత చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

News June 14, 2024

గొట్టిపాటి ఫ్యామిలీకి చంద్రబాబు పెద్దపీట

image

గొట్టిపాటి ఫ్యామిలీకి TDP అధినేత చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. 1995లో తన మొదటి మంత్రివర్గంలో గొట్టిపాటి హనుమంతరావుకి స్థానం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తమ్ముడి కుమారుడైన గొట్టిపాటి రవికుమార్‌ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. అంతేకాకుండా 1999లో హనుమంతరావు కుమారుడు నరసయ్యకు MLA టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. హనుమంతరావు మనమరాలైన లక్ష్మికి కూడా దర్శి టిక్కెట్ ఇచ్చారు.

News June 14, 2024

అనంత: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

గుమ్మగట్ట మండలం కృష్ణాపురానికి చెందిన మంజునాథ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని హనుమంతపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం బైక్‌పై కౌండపల్లికి వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

News June 14, 2024

చాపాడులో రోడ్డు ప్రమాదం

image

చాపాడు మండలం పల్లవోలు వద్ద ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. పల్లవోలు దళిత వాడకు చెందిన జయపాల్(55) రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. కారు నిలపకుండా వెళ్లిపోయాడు. చాపాడు ఎస్సై కొండారెడ్డి ఘటనాస్థలానికి వచ్చి గాయపడిన వ్యక్తిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించినట్లు స్థానికులు తెలిపారు. ‌

News June 14, 2024

నాడు కళా వెంకట్రావు.. నేడు అనిత

image

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతంవారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

News June 14, 2024

దైవ కార్యంగా భావిస్తా: హోం మంత్రి అనిత

image

సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను దైవ కార్యంగా భావిస్తానని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తనకు కీలకమైన హోం శాఖను అప్పగించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.

News June 14, 2024

పెద్దిరెడ్డి అక్రమాలపై చంద్రబాబుకు లేఖ

image

గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం, అనుచరులు అరాచకాలు, భూకబ్జాలు, గనుల దోపిడీ చేశారని బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. విద్యుత్తు ఒప్పందాల్లోనూ అవినీతి జరిగిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వీటిపై సమగ్ర విచారణకు మూడు రకాల కమిటీలు వేయాలని.. పెద్దిరెడ్డిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.

News June 14, 2024

వల్లూరులో కూలీల ఆటో బోల్తా

image

వల్లూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఉపాధి పనులు చేయడానికి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో తోల్ల గంగన్న పల్లె సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముంతా రాములమ్మ, స్వాతి, కృపావతి అనే మహిళా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీవో విజయ భాస్కర్, ఏపీఓ సుధారాణి, ఉపాధి సిబ్బంది వారిని పరామర్శించారు.

News June 14, 2024

నాడు దేవినేని.. నేడు నిమ్మల రామానాయుడు

image

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ శాఖకు మంత్రిగా జిల్లాకు చెందిన దేవినేని ఉమ ఐదేళ్లపాటు పనిచేశారు. సమర్థుడైన నిమ్మల ఈ శాఖకు న్యాయం చేస్తారని, మంత్రిత్వ శాఖల కేటాయింపులో చంద్రబాబు మార్క్ కనిపించిందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.