Andhra Pradesh

News June 14, 2024

వల్లూరులో కూలీల ఆటో బోల్తా

image

వల్లూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెకు చెందిన ఉపాధి కూలీలు శుక్రవారం ఉపాధి పనులు చేయడానికి ఆటోలో బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ఆటో తోల్ల గంగన్న పల్లె సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ముంతా రాములమ్మ, స్వాతి, కృపావతి అనే మహిళా కూలీలు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎంపీడీవో విజయ భాస్కర్, ఏపీఓ సుధారాణి, ఉపాధి సిబ్బంది వారిని పరామర్శించారు.

News June 14, 2024

నాడు దేవినేని.. నేడు నిమ్మల రామానాయుడు

image

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జలవనరుల శాఖను సీఎం చంద్రబాబు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ శాఖకు మంత్రిగా జిల్లాకు చెందిన దేవినేని ఉమ ఐదేళ్లపాటు పనిచేశారు. సమర్థుడైన నిమ్మల ఈ శాఖకు న్యాయం చేస్తారని, మంత్రిత్వ శాఖల కేటాయింపులో చంద్రబాబు మార్క్ కనిపించిందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News June 14, 2024

విశాఖ: రక్షణారంగం బలోపేతమే లక్ష్యం

image

రక్షణ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. విశాఖ విచ్చేసిన మంత్రి ఐఎన్ఎస్ డేగాలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రక్షణ రంగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ బలమైన స్వావలంబన కలిగిన రక్షణ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 14, 2024

NTR: తగ్గేదేలే అంటున్న టీడీపీ శ్రేణులు

image

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దుల్లేవు. తమ ఆనందాన్ని, టీడీపీకి తమ మద్దతును ఆ పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో తెలియజేస్తున్నాయి. తాజాగా పలువురు తమ బైక్‌లపై విజయవాడ ఎంపీ గారి తాలూకా అంటూ స్టిక్కర్లు ముద్రిస్తున్నారు. విజయవాడ ఎంపీ చిన్ని ఫోటో, ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీతో తిరుగుతున్న బైక్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

News June 14, 2024

గత అనుభవంతో సమర్థవంతంగా పని చేస్తా: నారా లోకేశ్

image

గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పని చేస్తానని నారా లోకేశ్ తెలిపారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

News June 14, 2024

కడప జిల్లాలో ఇప్పటి వరకు మంత్రులు వీరే

image

ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటి వరకు 21 మంది మంత్రులుగా పనిచేశారు. కోటిరెడ్డి, మునిరెడ్డి, రామచంద్రయ్య, ఖలీల్ బాషా, అహ్మదుల్లా, అంజాద్ బాషా, సరస్వతమ్మ, రత్నసభాపతి, బ్రహ్మయ్య, B. వీరారెడ్డి, డీఎల్, శివారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, వివేకానందరెడ్డి, బసిరెడ్డి, మైసూరారెడ్డి, YSR, రాజగోపాల్ రెడ్డి, జగన్ మంత్రులుగా పనిచేశారు. ప్రస్తుతం మండిపల్లి మంత్రి అయ్యారు.

News June 14, 2024

పెనుకొండ ఎమ్మెల్యేకు అప్పుడు.. ఇప్పుడు ఒకే శాఖ

image

పెనుకొండ ఎమ్మెల్యేకు మరోసారి బీసీ సంక్షేమశాఖ దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన శంకరనారాయణ ఈ శాఖతో పాటు రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా.. ఈసారి కూడా తొలిసారి గెలుపొందిన సవితకు ఇదే బీసీ సంక్షేమశాఖ దక్కడం గమనార్హం. కాగా వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు <<13439231>>మంత్రులు<<>> ఉండగా ఈసారి ముగ్గురు ఉండటం విశేషం.

News June 14, 2024

వంగర: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలంలో పశువులు మేపడానికి వెళ్లి వర్షం పడడంతో చెట్ల కింద నిలబడ్డారు. అదే సమయంలో సీతారాం (33) నిలపడిన చెట్టుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చెట్టుకు కూతవేటు దూరంలో ఉన్న వెంకటనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

News June 14, 2024

ఉమ్మడి విశాఖలో మొదటి హోంమంత్రి

image

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మొదటి హోంమంత్రిగా అనిత రికార్డు సృష్టించారు. 62 ఏళ్ల తర్వాత పాయకరావుపేట నియోజకవర్గానికి మంత్రి పదవి వరించింది. మొదటి సారి కేబినెట్‌లో చోటు సంపాదించుకున్న అనితకు చంద్రబాబు హోంశాఖను అప్పజెప్పి రాష్ట్ర శాంతిభద్రతలు ఆమె చేతిలో పెట్టారు. వృత్తి పరంగా టీచర్ కావడం ప్లస్ పాయింట్. ప్రతి విషయంపై సమగ్రమైన అవగాహన ఉండటం, వాగ్ధాటి, సూటిగా మాట్లాడేతత్వం ఆమెకు కలిసొచ్చే అంశాలు.

News June 14, 2024

విశాఖ వచ్చిన రాజ్ నాథ్ సింగ్

image

రెండోసారి కేంద్ర రక్షణ శాఖ పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వచ్చిన రాజ్ నాథ్ సింగ్‌కు విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో ఐఎన్ఎస్ జలస్వా నౌకపై దిగారు. అనంతరం ఈస్ట్రన్ ప్లీట్‌లో డేట్ సీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్లో సందర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.