Andhra Pradesh

News June 14, 2024

పార్వతీపురం మన్యం జిల్లాకే వరుసగా మూడోసారి

image

వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2019లో కొత్తగా ప్రవేశ పెట్టిన గిరిజన సంక్షేమశాఖ వరుసగా మూడోసారి మన్యం జిల్లాకి వరించింది. YCP హయాంలో కురుపాం MLA పాముల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో జిల్లాలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News June 14, 2024

జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టాడు: మంత్రి అచ్చెన్న

image

చంద్రబాబు మంత్రివర్గంలో సొంత సామాజికవర్గానికి చెందిన 15 మందికి అవకాశం కల్పించారని కొన్ని ఛానళ్లలో వస్తున్న కథనాలు పూర్తిగా ఫేక్ అని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు వైసీపీని 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా జగన్‌కు సిగ్గు రాలేదని ట్విటర్(X) వేదికగా ఫైరయ్యారు. 15 మంది కమ్మ కులానికి చెందిన మంత్రులంటూ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలెట్టారంటూ దుయ్యబట్టారు.

News June 14, 2024

అన్నమయ్య: శవంగా దర్శనమిచ్చిన సుదర్శన్  

image

లక్కిరెడ్డిపల్లిలో 20 రోజుల కిందట అదృశ్యమైన చిన్నకొండు సుదర్శన్ (34) గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. స్థానికుల వివరాల మేరకు.. పాలెం గొల్లపల్లి గ్రామం బురుజు పల్లికి చెందిన చిన్నకొండ సుదర్శన్ 20 రోజుల కిందట కనిపించకుండా పొయ్యి గురువారం పాలెం గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

శ్రీకాకుళం: ఈ నెల 17న జిల్లాకు రానున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు

image

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు ఈనెల 17వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటనలో తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్చి, డే&నైట్ కూడలి, 7 రోడ్లు జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, అరసవల్లి జంక్షన్, 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ కార్యాలయంకి ర్యాలీగా వెళ్తారు. అచ్చెన్నాయుడు సాయంత్రం 5 గంటలకు MP కార్యాలయం నుండి పెద్దపాడు మీదుగా నిమ్మాడ చేరుకుంటారు.

News June 14, 2024

TPT: రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

TTD ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు శనివారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యాలయం పేర్కొంది. పీడియాట్రిక్ అసోసియేట్& అసిస్టెంట్, పీడియాట్రిక్ ఇంటెన్స్‌ విస్ట్ , అసిస్టెంట్ అనస్తీషియా మొత్తం 4 పోస్టులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News June 14, 2024

అమరావతిలో పరుగుల పెట్టనున్న ఐటీ రంగం

image

నారా లోకేశ్ మరోసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చంద్రబాబు మానసపుత్రికైన అమరావతిలో ఐటీ రంగానికి పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి, ఐటీ రంగాన్ని లోకేశ్ పరుగులు పెట్టిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఐటీ మంత్రిగా చేసిన అనుభవం లోకేశ్‌కు పని కొస్తుందని వివరిస్తున్నారు.

News June 14, 2024

అప్పుడు బాలినేనికి, ఇప్పుడు గొట్టిపాటికి

image

వైసీపీ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసుల రెడ్డి విద్యుత్, అడవులు పర్యావరణం, శాస్త్ర సాంకేతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు విద్యుత్ శాఖ కేటాయించారు. దీంతో జిల్లాకు రెండో సారి విద్యుత్ శాఖనే వరించింది. గత ప్రభుత్వంలో జిల్లాకు ఇద్దరికి మంత్రి పదవులు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వంలో కూడా ఇద్దరికి మంత్రి పదువులు వరించాయి.

News June 14, 2024

పేర్ని, జోగి పని చేసిన శాఖలకు మంత్రిగా పార్థసారథి

image

వైసీపీ హయాంలో పేర్ని నాని 2019- 2022 మధ్య సమాచార శాఖ మంత్రిగా ఉన్నారు. జోగి రమేశ్ సైతం 2022- 24 మధ్య గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. తాజాగా చంద్రబాబు గృహనిర్మాణం, సమాచార శాఖలకు మంత్రిగా టీడీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పార్థసారథికి పలువురు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు.

News June 14, 2024

CTR: మంత్రులు లేకున్నా.. సీఎం మనవారే

image

గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులుగా వ్యవహరించారు. నారాయణ స్వామి డిప్యూటీ CM, ఎక్సైజ్ మంత్రిగా పని చేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కీలకమైన విద్యుత్తు, మైనింగ్ శాఖ.. రోజా పర్యాటక, క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజా కేబినెట్‌లో ఎవరికీ చోటు లేకపోయినా.. కుప్పం నుంచి గెలిచిన CM చంద్రబాబు సాధారణ పరిపాలన, లాండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు ఉంచుకున్నారు.

News June 14, 2024

తూ.గో: మంత్రులుగా అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి తూ.గో నుంచి గత ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా చేశారు. చెల్లుబోయిన- బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, I&PR శాఖ, పినిపే విశ్వరూప్- సాంఘిక సంక్షేమ శాఖ, దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు పవన్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు, వాసంశెట్టికి లేబర్, ఫ్యాక్టరీలు, వైద్య, బీమా సేవలు శాఖలు దక్కాయి.