Andhra Pradesh

News June 14, 2024

తిరుపతి : దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 15.

News June 14, 2024

ఎల్.కోట: పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడు

image

ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిదిలోని కొనమసివానిపాలెం గ్రామనికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు శారీరకంగా వాడుకున్నాడని, పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేసినట్లు యువతి చెప్పింది. యువకుని తల్లిదండ్రులను సంప్రదిస్తే కులాంతర వివాహం అంటూ నిరాకరించడంతో గురువారం పోలీసులను ఆశ్రయించింది.

News June 14, 2024

గుంటూరు: అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధలు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిర్రావూరు గ్రామానికి చెందిన ప్రకాశ్ రావు (54) అప్పుల బాధలు గురువారం సాయంత్రం గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి మరణించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 14, 2024

యూట్యూబ్ వీడియోలను చూసి రైతులు మోసపోకండి: వ్యవసాయ అధికారి

image

యూట్యూబ్‌లో వీడియోలను చూసి వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరి సూచించారు. యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేసినట్లు వ్యవసాయాన్ని క్రియేట్ చేయలేమన్నారు. ప్రతి రైతూ అధికారుల సూచనలు, సలహాలు పాటించి పంటలను సంరక్షించుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News June 14, 2024

మదనపల్లె: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తండ్రినే చంపేసింది..!

image

మదనపల్లెలో టీచర్ దొరస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి ఖాయం చేయడంతో దొరస్వామి కుమార్తే చపాతి కర్ర, ఇనుప అట్టతో కొట్టి చంపినట్లు తెలిపింది. హరితను పోలీసులు అదుపులోకి తీసుకుని,హత్యకు వాడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రేమ విషయమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రియుడితో కలిసి ఉండడాన్ని గమనించి తండ్రి మందలించారని..ప్రియుడితో కలిసి హత్య చేసి ఉంటుందని అంటున్నారు.

News June 14, 2024

సస్పెండ్ చేయడం అన్యాయం: మాజీ ఎమ్మెల్సీ రాఘురాజు

image

ఎటువంటి తప్పు లేకుండా కేవలం తన భార్య పార్టీ మారిందని ఎమ్మెల్సీ పదవి నుంచి నన్ను సస్పెండ్ చేయడం అన్యాయమని, దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని మాజీ ఎమ్మెల్సీ రఘురాజు అన్నారు. శుక్రవారం విజయనగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తను వైసీపీని వీడలేదని, తన భార్య పార్టీ మారిందనే కోణంలో ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయడం సరికాదన్నారు.

News June 14, 2024

శ్రీకాకుళం: బీటెక్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో బీటెక్(కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్) 4వ ఏడాది విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2020-21 నుంచి అడ్మిట్ అయిన బ్యాచ్‌లు) స్పెషల్ పరీక్షల టైం టేబుల్‌ విడుదలైంది. జూన్ 24 నుంచి 28 మధ్య ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 14, 2024

రూ.100 కోట్ల అక్రమాలు.. బైరెడ్డిపై CIDకి ఫిర్యాదు

image

ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.

News June 14, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా సత్రాగచ్చి- చెన్నై సెంట్రల్ (నం.06006) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECOR) తెలిపింది. ఈ ట్రైన్ శనివారం రాత్రి 9.50 గంటలకు పలాస, 11.20కి శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుందని, ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై చేరుకుంటుందని పేర్కొంది. విజయవాడ, గూడూరు, నెల్లూరు, ఒంగోలు తదితర స్టేషన్లలో ఆగుతుందని ECOR తెలిపింది.

News June 14, 2024

మరో 2 రోజుల్లో జగన్‌పై FIR నమోదు: RRR

image

తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్‌పై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (RRR) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మరో రెండు రోజుల్లో జగన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని RRR చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను ఘన విజయం సాధించానని చెప్పారు. తనకు స్పీకర్ పదవి ఇస్తే స్వీకరిస్తానని.. ఇవ్వకపోయినా తనకు ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.