Andhra Pradesh

News June 14, 2024

మరో 2 రోజుల్లో జగన్‌పై FIR నమోదు: RRR

image

తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్‌పై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు (RRR) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మరో రెండు రోజుల్లో జగన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని RRR చెప్పారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తాను ఘన విజయం సాధించానని చెప్పారు. తనకు స్పీకర్ పదవి ఇస్తే స్వీకరిస్తానని.. ఇవ్వకపోయినా తనకు ఉన్న బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.

News June 14, 2024

ప్రమాదకరంగా కడప-చెన్నై రహదారిలోని బ్రిడ్జ్

image

ఒంటిమిట్ట బస్టాండ్ సమీపంలోని శ్రీరామ నగర్ మలుపు వద్ద ఉన్న కడప-చెన్నై ప్రధాన రహదారి బ్రిడ్జికి పెచ్చులు ఊడి కడ్డీలు కనిపిస్తున్నాయి. అధికారులు స్పందించి బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ ఈ బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడితే కడప నుంచి రాజంపేట, కోడూరు, తిరుపతి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతాయి.

News June 14, 2024

చిల్లకూరు : కారును ఢీకొన్న లారీ

image

చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలు కాగా.. వారిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిల్లకూరు పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వివరాలు సేకరిస్తున్నారు.

News June 14, 2024

రోడ్డు ప్రమాదంపై ఎంపీ పురందీశ్వరి దిగ్భ్రాంతి

image

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లి వద్ద 216వ జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్‌లో మృతుల కుటుంబాలకు బీజేపీ స్టేట్ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి సంతాపం తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని అన్నారు. క్షతగాత్రులను రక్షించేందుకు చొరవ చూపిన స్థానికులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

News June 14, 2024

మంత్రిపదవిపై అయ్యన్నపాత్రుడి రియాక్షన్

image

జూనియర్లకు మంత్రులుగా అవకాశం రావడం పట్ల సీనియర్‌గా ఆహ్వానిస్తున్నానని అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. సీనియర్లకు అవకాశం ఇవ్వలేదంటున్నారని.. తనకు 25 ఏళ్లకే NTR మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ‘ఇప్పటికే 5సార్లు మంత్రిగా, ఒకసారి MPగా చేశాను మిగతావారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా’ అని పేర్కొన్నారు. ‘పదవి రానివారిని చంద్రబాబు ఓదార్చాలా.. మాకు MLA టికెట్ ఇవ్వడమే గొప్ప’ అని వ్యాఖ్యానించారు.

News June 14, 2024

మెగా DSC నోటిఫికేషన్ విడుదల.. నిరుద్యోగుల్లో ఉత్సాహం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత మెగా DSC నోటిఫికేషన్ విడుదలతో ఉత్సాహం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో 2,636 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాలో కేవలం 180 పోస్టులనే చూపించారని, 1,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని DSC అభ్యర్థులు చెబుతున్నారు. తాజా నోటిఫికేషన్‌తో జిల్లాలో గరిష్ఠంగా టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News June 14, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతిచెందిన సంఘటన జీబీసీ రహదారిలో గురువారం రాత్రి జరిగింది. పొన్నూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలో 28వ వార్డుకు చెందిన ఆదినారాయణ (70)పచారీ దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జీబీసీ రహదారిలో టీ తాగేందుకు వెళ్లి తిరిగి దుకాణం వద్దకు వస్తున్న సమయంలో గుంటూరు నుంచి బాపట్ల వెళ్తున్న ఓ లారీ అయన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News June 14, 2024

తూ.గో జడ్పీ ఛైర్మన్ విప్పర్తి సోదరుడు మృతి

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాలరావు సోదరుడు విప్పర్తి రామారావు(75) గురువారం రాత్రి ధవళేశ్వరంలోని స్వగృహంలో మృతి చెందారు. రామారావు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇంటికి వెళ్లి జడ్పీ ఛైర్మన్ వేణుగోపాలరావును పరామర్శించారు.

News June 14, 2024

YCP నాయకుడి గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ తొలగించండి: గ్రామస్థులు

image

గాండ్లపెంట మండలం కల్లుబావి తండాకు సమీపంలలో YCP నాయకుడు రామాంజులు గెస్ట్‌హౌస్‌ నిర్మించుకొని పంచాయతీ బోరు నుంచి పైపులైన్‌ వేసుకున్నాడని, దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపించారు. ఆ పైపులైన్‌ను తొలగించాలని కోరుతూ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పంచాయతీ బోరు నుంచి ఎంపీటీసీ నిధులతో గెస్ట్‌హౌస్‌కు పైపులైన్‌ వేసుకొని తోటకు నీరు వాడుకుంటున్నట్లు తెలిపారు.

News June 14, 2024

VZM: ఉమ్మడి జిల్లాలో 4.27లక్షల మందికి లబ్ధి

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 4.27 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వంతో లబ్ధి చేకూరనుంది. వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులకు నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు చొప్పున పింఛన్ ఇక నుంచి అందనుంది. రెండు జిల్లాల్లో గత ప్రభుత్వం నెలకు 125.32 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం పెంచిన నగదుతో పాటు 3 నెలల బకాయిలు రూ. 7వేలు కలిపి జూలై నెలలో రూ.230 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది.