Andhra Pradesh

News June 14, 2024

రోజా అక్రమాలు చేశారని ఫిర్యాదు

image

ఆడుదాం ఆంధ్రా, CM కప్ పేరిట అప్పటి క్రీడా శాఖ మంత్రి రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం CEO ఆర్డీ ప్రసాద్ ఆరోపించారు. ఆ రెండు కార్యక్రమాల పేరిట రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై విచారణ చేయాలని తాను CIDకి ఫిర్యాదు చేశానని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, IIITలో అడ్మిషన్లు పొందిన వారిపైనా విచారణ చేయాలని కోరారు.

News June 14, 2024

సర్పంచ్ పదవికి గోండు శంకర్ రాజీనామా

image

శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామపంచాయతీ సర్పంచ్ గోండు శంకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన గోండు శంకర్.. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై గెలుపొందారు. దీంతో గోండు శంకర్ సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని డీపీఓ వెంకటేశ్వరరావుకు అందజేశానని ఆయన తెలిపారు.

News June 14, 2024

విశాఖ: వసతి గృహాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడీ కె.రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్రీ మెట్రిక్-8, పోస్ట్ మెట్రిక్-14, వసతి గృహాలు ఉన్నట్లు తెలిపారు. ఫ్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 872, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 672 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వివరాల కోసం MVP కాలనీ, భీమిలిలోని సహాయ సాంఘీక సంక్షేమశాఖ కార్యాలయాలను సంప్రదించాలన్నారు.

News June 14, 2024

16 నుంచి ఒలంపిక్ క్రీడా పోటీలు

image

ప్రపంచ ఒలంపిక్ డే రన్‌ సందర్భంగా ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు క్రీడా పోటీలను కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షడు జగదీష్ కుమార్ తెలిపారు.16న టైక్వాండో, స్విమ్మింగ్, స్కేటింగ్,18న యోగా,హాకీ, ఉషు,కరాటే,చెస్,19న వాలీబాల్,టెన్నికాయిట్, సెపక్ తక్రా, షూటింగ్ బాల్,కబడ్డీ,క్యారమ్, 20న హ్యాండ్‌బాల్, సాప్ట్ బాల్, బాస్కెట్ బాల్ పోటీలు ఉంటాయన్నారు.

News June 14, 2024

భోగాపురం: వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటకు సమయం వచ్చింది. విరామ గడువు తీరడంతో రెండు నెలల తర్వాత తిరిగి వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో చేపల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఏప్రిల్ 15నుంచి ఈనెల 14 వరకు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధం విధించింది. ఇపుడు గడువు తీరడంతో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సామగ్రిని సిద్ధం చేసుకుని వేటకు వెళ్లనున్నారు.

News June 14, 2024

కృష్ణా: విధుల్లో తిరిగి చేరిన 85 మంది ఉపాధ్యాయులు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 85 మంది ఒప్పంద ఉపాధ్యాయులను, అధ్యాపకులను గురువారం నుంచి విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ DCO సుమిత్రాదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 విద్యా సంవత్సరంలో SSC, ఇంటర్ ఫలితాలలో ఆయా ఉపాధ్యాయులు సాధించిన ఉత్తమ ఫలితాల ఆధారంగా వారిని మరలా విధుల్లోకి చేర్చుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News June 14, 2024

70ఏళ్ల ‘పాలకొల్లు’ చరిత్రలో ‘నిమ్మల’ సరికొత్త రికార్డ్

image

70ఏళ్ల చరిత్ర గల పాలకొల్లు నియోజకవర్గంలో డా.నిమ్మల రామానాయుడు కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇక్కడ 1955 నుంచి ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరగ్గా.. ఓటర్లు నిమ్మలకు మాత్రమే ‘హ్యాట్రిక్’ ఇచ్చారు. 1983, 85తో పాటు 1994, 99 ఎన్నికల్లో వరుసగా అల్లు వెంకటసత్యనారాయణ గెలిచినా.. హ్యాట్రిక్ సాధ్యం కాలేదు. 3వసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2014, 19లో గెలిచిన నిమ్మల ఈసారి హ్యాట్రిక్ కొట్టి మంత్రి పదవి చేపట్టారు.

News June 14, 2024

కడప: తిరుమల ఎక్స్‌ప్రెస్ నంబర్ల మార్పు

image

కడప-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లలలో మార్పు చేసినట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. కడప- విశాఖపట్నం, విశాఖపట్నం-కడప మధ్య నడిచే ఈ రైలు ప్రస్తుతం 17487/17488 నంబర్లతో నడుస్తోంది. జులై ఒకటో తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నంబర్లతో నడుస్తుందని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు.

News June 14, 2024

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామాకు ఆమోదం

image

వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన తన తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు ప్రభుత్వం నిన్న ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడి పదవికి కూడా మోహిత్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News June 14, 2024

కొయ్యూరు: మనస్తాపంతో యువతి సూసైడ్

image

కొయ్యూరు మండలం మఠం భీమవరం పంచాయతీ బొడ్డుమామిడి లంకకు చెందిన కుండ్ల రాధమ్మ(19)అనే యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధమ్మ చిన్నతనంలో తల్లి చనిపోయింది. ఆ తర్వాత సోదరుడు మృతి చెందాడు. తనను ఎంతో అపురూపంగా చూసుకునే నాన్నమ్మ ఇటీవలే చనిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాధమ్మ గురువారం ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంప ఎస్సై లోకేశ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.