Andhra Pradesh

News June 14, 2024

గుంటూరులో మహిళ మృతదేహం లభ్యం

image

చేబ్రోలు మండలంలోని వడ్లమూడి నక్కల గుంత సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై మహేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలగుంత సమీపంలో మహిళ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఉంది. కాషాయం రంగు ఆకులు ఉన్న తెల్ల చీర, ఆరెంజ్ రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. హత్యా? లేదా ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

News June 14, 2024

ప.గో: ముగిసిన గడువు.. ఇక చేపలే చేపలు

image

తీర ప్రాంతంలో చేపల వేటపై నిషేధ ఉత్తర్వులు రద్దుకానున్నాయి. ఏప్రిల్ 15 నుంచి దాదాపు 60 రోజుల పాటు విధించిన నిషేధాజ్ఞలు శుక్రవారం అర్ధరాత్రితో ఎత్తివేయనున్నారు. దీంతో తీర ప్రాంతాల్లో తిరిగి బోట్ల సందడి మొదలుకానుంది. 2 నెలల పాటు వృత్తికి దూరంగా ఉన్న మత్స్యకారులు వలలు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ రంగంపై ప్రత్యేకంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 2000 మందికి మళ్లీ ఉపాధి దక్కనుంది.

News June 14, 2024

పిఠాపురం మండలంలో దారుణ హత్య

image

పిఠాపురం మండలంలో దారుణ హత్య జరిగింది. భోగాపురంలోని దుర్గమ్మ ఆలయ ఆవరణలో నిద్రించిన బ్రహ్మదేపు ప్రసాద్‌ను పద్మరాజు అనే వ్యక్తి పెద్ద బండరాయితో మోది హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితుడు పిఠాపురం రూరల్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

VZM: నాడు-నేడు రెండో విడత పనులు కొనసాగేనా?

image

పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన నాడు నేడు రెండో విడత పనులు పలు పాఠశాలల్లో నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు రూ. 50కోట్ల నిధులతో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. కాగా నిధుల లేమితో కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో నాడు-నేడు రెండో విడత పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

News June 14, 2024

కర్నూలు: గుంతలోకి దూసుకెళ్లిన కంటైనర్

image

ఎమ్మిగనూరు మండలం చీరాలదొడ్డి-ఎర్రకోట సమీపంలో గురువారం రాత్రి మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వస్తూ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి వెళ్లి చూడగా.. డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా లారీ నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

News June 14, 2024

చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: గంటా

image

ఉపాధ్యాయ ఉద్యోగాల కల్పన దిశగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఐదేళ్లపాటు ఇదిగో డీఎస్సీ అంటూ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరో నాలుగు కీలక ఫైల్స్‌పై సంతకాలు చేసిన చంద్రబాబు మంచి పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

News June 14, 2024

పెళ్లి సంబంధాలు.. కువైట్‌లో సోంపేట వాసి మృతి

image

సోంపేట మండలం జింకిభద్రకు చెందిన లోకనాథ్(31) నిన్న కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతిచెందాడు. చిరంజీవి, నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లోకనాథం ఉన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కువైట్‌కు వెళ్లి పనుల్లో చేరాడు. పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో నెల రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 8న బయలుదేరి వెళ్లాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

News June 14, 2024

శ్రీ సత్యసాయి: రోల్‌వెల్ పరిశ్రమలో వ్యక్తి మృతి

image

హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలోని రోల్‌వెల్ పరిశ్రమలో శుక్రవారం ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. కొటిపి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ(44) రోల్‌వెల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం విధులకు వెళ్లి మృతిచెందాడు. గుండెపోటుతో మృతి చెందాడా? లేక ప్రమాదం ఏమైనా సంభవించిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News June 14, 2024

మదనపల్లెలో టీచర్ హత్య UPDATE

image

మదనపల్లెలో ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి <<13430375>>దారుణ హత్య<<>>కు గురైన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతుని కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుమార్తే హత్యచేయించినట్లు సమాచారం అందగా..హత్య సమయంలో కూతురు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

గుంటూరు: జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

గుజ్జనగుండ్ల సర్కిల్లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, నర్సింగ్ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్‌లతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని సూచించారు.