Andhra Pradesh

News September 13, 2025

15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్‌లో అందజేయాలన్నారు.

News September 13, 2025

కడప: RIMS పూర్వ వైద్యాధికారులపై విచారణకు ఆదేశాలు

image

కడప RIMSలో గతంలో పనిచేసిన వైద్యాధికారులపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు సురేశ్వర రెడ్డి, జొన్న నగేశ్, షేక్ మహబూబ్ బాషా, సంజీవయ్య, సత్యనారాయణపై విచారణకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరావు, కడప ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డిలను విచారణాధికారులుగా నియామకం చేశారు.

News September 13, 2025

కర్నూలు: ‘ప్రజల వద్దకే తపాల సేవలు’

image

తపాల శాఖలో నూతన టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐయంఏ 2.O ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజల ముంగిటే తపాల సేవలను అందివ్వడం జరుగుతుందని కర్నూలు జిల్లా పోస్టల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం తుంగభద్ర ఉప తపాల కార్యాలయంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీపీఎంలు, ఎబీపీఎంలతో సమావేశం నిర్వహించారు. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్‌తో తపాల బీమా, ఐపీపీబీ ద్వారా ఖాతాలు తెరవడం జరిగిందని తెలిపారు.

News September 13, 2025

ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

image

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013 నాన్ క్యాడర్ IPSగా రాష్ట్ర పోలీసు శాఖలో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.

News September 13, 2025

విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

image

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.

News September 13, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

image

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News September 13, 2025

ప్రకాశం జిల్లా నూతన SP నేపథ్యం ఇదే.!

image

ప్రకాశం జిల్లాకు <<17699232>>SPగా వి హర్షవర్ధన్ రాజు<<>> నియమితులైన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని కావలికి చెందిన ఈయన అనంతపురం JNTUలో బీ.టెక్ పూర్తి చేశారు. 2013లో రాష్ట్ర పోలీసు సేవల్లో చేరారు. విజయవాడలో DCP, అన్నమయ్య, కడప జిల్లాల SP, విజయవాడలో CID SP, ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తూ.. ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు.

News September 13, 2025

మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

News September 13, 2025

ధవళేశ్వరం విచ్చేసిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేశారు. శనివారం గ్రామంలో జరిగిన మెండా సీతారామయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పున్నమరాజు వీర్రాజు పాల్గొన్నారు.