Andhra Pradesh

News June 14, 2024

తూ.గో: ఘాటెక్కిన ఉల్లి ధర.. తగ్గిన దిగుమతులు

image

ఉల్లిపాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 పైన పలుకుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోజుకు 900 టన్నులు ఉల్లిపాయలను వినియోగిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు దిగుబడులు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి రాజమండ్రి, రావులపాలెం, రాజోలు, మడికి, చొప్పెల్ల మార్కెట్లకు 30 లారీల్లో 600 టన్నులు మాత్రమే దిగుమతి జరుగుతోందని వారు తెలిపారు.

News June 14, 2024

శ్రీకాకుళం: మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య

image

వీరఘట్టం మండలం బూరుగ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బాలకృష్ణ(38) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణంనాయుడు గురువారం తెలిపారు. మద్యానికి బానిసైన బాలకృష్ణను భార్యతో పాటు తన తల్లి మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News June 14, 2024

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

image

కృత్తివెన్నులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News June 14, 2024

విశాఖ: జూలై 29 నుంచి ప్రత్యేక లోక్ అదాలత్

image

సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారం కోసం జూలై 29 నుంచి ఆగస్టు మూడో తేదీ వరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.గిరిధర్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. కేసులు రాజీ చేసుకునేందుకు కక్షిదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు.

News June 14, 2024

తొలిరోజు పాఠశాలలకు 63.75 శాతం హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50 రోజుల సెలవులు అనంతరం గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు పాఠశాలలు మొత్తం 3,055 ఉండగా.. వీటిల్లో తొలిరోజు 63.75 శాతం మంది విద్యార్థులు బడులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 2,57,274 మంది విద్యార్థులు చదువుతుండగా.. తొలి రోజు 1,32,949 మంది హాజరై, 76,330 మంది గైర్హాజరయ్యారని డీఈవో కే.వెంకటేశ్వరరావు వెల్లడించారు.

News June 14, 2024

కోవూరు జాతీయ రహదారిపై ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

కోవూరు జాతీయ రహదారిపై ఆర్కే పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కు లారీని మామిడి కాయలు లోడుతో వస్తున్న మినీ ట్రక్ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా … క్లీనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News June 14, 2024

కర్నూలు: శాప్ నెట్‌వర్క్ ఛైర్మన్ రాజీనామా

image

రాష్ట్ర శాప్ నెట్‌వర్క్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి ఎమ్మిగనూరుకు చెందిన వైసీపీ నేత మాచాని వెంకటేశ్ గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు శాప్ నెట్‌వర్క్ సీఈఓకు తన రాజీనామా పత్రాన్ని పంపారు. తనపై నమ్మకముంచి పదవి ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తనకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

News June 14, 2024

ప్రకాశం: జిల్లాకు వెయ్యికి పైగా డీఎస్సీ పోస్ట్‌లు..?

image

సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో జిల్లాలోని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 16,347 డీఎస్సీ పోస్ట్‌లలో జిల్లాకు వెయ్యికి పైగా వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా ఇది వరకే దాదాపు 20 వేల మంది టెట్ పరీక్ష రాశారు. ఈ మెగా డీఎస్సీ ప్రకటనతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News June 14, 2024

తిరుపతి: గంజాయి విక్రేతల అరెస్ట్

image

బాలుడితో పాటు ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు తిరుపతి రూరల్ ఎస్సై షేక్షావలి తెలిపారు. గురువారం తిరుపతి గ్రామీణ మండలం రామాంజుపల్లి కూడలి వద్ద అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న కర్ణాటకకు చెందిన జేహెచ్ భరత్, బెంగళూరు నగరానికి చెందిన కార్తీక్ అంజన్ కుమార్‌తోపాటు మరో బాలుడి నుంచి రూ.7,500 విలువైన 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News June 14, 2024

నెల్లిమర్లలో బాలుడి హత్యకు కారణం ఇదే!

image

నెల్లమర్లలోని కొండపేటలో ఇటీవల జరిగిన బాలుడి హత్య కేసును ఛేదించినట్లు సీఐ రామారావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో ఆడేవాడు. ఆటలో గెలిచిన తర్వాత వారిని ఆటపట్టించడంతో కోపం పెంచుకున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం బాలుడిని తాటికాయల కోసం అని కొండపైకి తీసుకెళ్లారు. అక్కడే వెనుకనుంచి రాయితో కొట్టడంతో మృతిచెందాడు. నిందుతులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.