Andhra Pradesh

News June 14, 2024

ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్

image

జాతీయ లోక్ అదాలత్‌ను ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా వెల్లడించారు. జిల్లా కోర్టుతో పాటు ఆముదాలవలస, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాలి, నరసన్నపేట, కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం కోర్టులలోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News June 14, 2024

ముత్తుకూరు: పొంగూరు నారాయణ సూక్ష్మ చిత్రం

image

మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నారాయణకు శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ముత్తుకూరుకు చెందిన సూక్ష్మ చిత్రకారుడు సోమా పద్మా రత్నం ఆయన సూక్ష్మ చిత్రాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా అతడిని పొంగూరు అభిమానులు, రాజకీయ నాయకులు అభినందించారు.

News June 14, 2024

బద్వేలు: ప్రియురాలిని హత్య చేయబోయి.. ఆత్మహత్య

image

బద్వేలులో సాయికుమార్ రెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై సీఐ యుగంధర్ రెడ్డి స్పందించారు. కలసపాడుకు చెందిన సాయి కుమార్ సిద్దమూర్తిపల్లెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఆమె సాయిని దూరం పెట్టింది. తన ప్రేమను నిరాకరించిదని ప్రియురాలిని హత్య చేయబోయిన సాయి.. అది బెడిసికొట్టడంతో తన అక్క ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.

News June 14, 2024

విశాఖ: యువతి ఆత్మహత్య

image

విశాఖలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్ నగర్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్న యువతి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధిక (22) డిగ్రీ పూర్తి చేసింది. ఈ నేపాథ్యంలో తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రాధిక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 14, 2024

నాలుగు నెలల చిన్నారి.. అదుర్స్..!

image

4 నెలల చిన్నారి క్రిస్టినా సియారా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆంగ్ల అక్షరాలు, జంతువులు, పండ్లు, పక్షులు.. వంటి వాటిని గుర్తించడంలో ప్రతిభ చూపి నోబెల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. గుంతకల్లు మోదీనాబాద్‌లో ఉండే రైల్వే ఉద్యోగి సుధాకర్, సింధు దంపతులు గురువారం కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిశారు. కలెక్టర్‌ సమక్షంలో మెడల్, ప్రశంసా పత్రాన్ని ప్రదర్శించారు.

News June 14, 2024

పవన్‌కు లా&ఆర్డర్ కంట్రోల్ చేసే సత్తా ఉంది: వర్మ

image

జనసేన అధినేత, మంత్రి పవన్‌ కళ్యాణ్‌ను పిఠాపురం మాజీ MLA వర్మ గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వర్మ కారుపై దాడి గురించి పవన్‌ ఆరా తీశారు. ఇలాంటివి సరికాదని విచారం వ్యక్తం చేయడంతో పాటు ఖండించినట్లు వర్మ తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సత్తా పవన్‌కు ఉందని, ఆయన తర్వలోనే పిఠాపురంలో పర్యటిస్తారని అన్నారు.

News June 14, 2024

కువైట్‌లో అగ్నిప్రమాదం.. పెరవలి వాసులు మృతి

image

కువైట్‌ అగ్నిప్రమాదంలో పెరవలి వాసులు ఇద్దరు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ(38) 12ఏళ్ల కింద, అన్నవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు(40) పదేళ్ల కింద జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు. ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నారు. బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందడంతో గ్రామాల్లో విషాదం నెలకొంది. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబీకులు కన్నీరుపెడుతున్నారు.

News June 14, 2024

తిరుపతి: ఆస్తి తగాదాలు.. కత్తితో తాడి

image

తొట్టంబేడు మండలంలోని పూడి గ్రామంలో ఆస్తి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హరిని ఆయన అన్నతో పాటు వారి కుటుంబీకులు కత్తులు, కర్రలతో దాడులు చేశారు. హరికి తలపై బలమైన గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై తొట్టంబేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

News June 14, 2024

కడప: ఆ కాలేజీకి 72 ఏళ్ల చరిత్ర

image

కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల) వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. సరిగ్గా 72 సంవత్సరాల క్రితం 1952 జూన్ 14న ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.వి.రాజగోపాలాచారి చేతుల మీదుగా ఆర్ట్స్ కళాశాల భవనాలకు శంకుస్థాపన జరిగింది. దీంతో ప్రతి ఏటా జూన్ 14న వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తెలిపారు.

News June 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు నేడు వర్షసూచన

image

కృష్ణా జిల్లా పరిధిలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.