Andhra Pradesh

News June 14, 2024

చంద్రబాబును కలిసిన ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేశ్ గురువారం సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలిశారు.

News June 14, 2024

రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యధావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.* నం.07864 గుంటూరు- విజయవాడ* నం.07628 విజయవాడ- గుంటూరు* నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్* నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ

News June 14, 2024

23 నుంచి నర్రవాడలో బ్రహ్మోత్సవాలు

image

దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో గురువారం పల్లకీ సేవ నిర్వహించినట్లు ఈవో ఉషశ్రీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ… ప్రతి గురువారం పల్లకీ సేవ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.

News June 13, 2024

కడప జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులో..?

image

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి కడప జిల్లాలో 289 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు 700లకు పైగా పోస్టులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 13, 2024

ఎంపీటీసీ పదవికి కురుపాం ఎమ్మెల్యే రాజీనామా

image

కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆమె గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుపాం నుంచి బరిలో నిలిచి మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై విజయం సాధించారు. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయగా.. జడ్పీ సీఈవో ఆమోదించారు.

News June 13, 2024

కార్యకర్త మరణం.. ఆర్థికసహాయం చేసిన ఇంటూరి

image

కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన ఇనకల్లు నరసింహం అనే యువకుడు రెండు రోజుల క్రితం గ్రామంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియచేసే ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్‌తో మరణించాడు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సాయంత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించి, నరసింహం తల్లి అనురాధను ఓదార్చారు. రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆమెకు అందించారు.

News June 13, 2024

రాష్ట్రపతిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గురువారం కలిశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడానికి ఢిల్లీ కేంద్రంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొని విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇస్తారని అన్నారు.

News June 13, 2024

స్పెషల్ గెటప్‌లో విశాఖ సీపీ

image

గంగవరం పోర్ట్ నిర్వాసితుల కార్మికుల బడాఖానా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ కమిషనర్‌కు చక్కటి సన్మానం చేశారు. మత్స్యకారుడి వేషంలో ఒక చేత్తో వల, మరో చేతితో చేప, భుజం మీద బ్యాగు, నెత్తి మీద టోపీతో పోలీస్ కమిషనర్ రవిశంకర్ వినూత్నంగా కనిపించారు.

News June 13, 2024

చిత్తూరు జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులో..?

image

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 337 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు వెయ్యి పోస్టుల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 13, 2024

కర్నూలు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

మిడుతూరు మండలం దేవనూరు గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ (35) అనే రైతు పురుగు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకి తీసుకొని అప్పులు చేసి పంటలు వేశారు. పంట నష్టం రావడంతో రూ.10 లక్షలు అప్పులయ్యాయి. చేసిన అప్పులు తీర్చలేమని రఫీ బాధపడేవారని.. దీంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబీకులు తెలిపారు.