Andhra Pradesh

News June 13, 2024

రాజమండ్రి: భరత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: ఆదిరెడ్డి

image

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌‌గా మారారని, ఆయన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీ మోహన్‌, భరత్‌ హయాంలో వేసిన శిలాఫలకాలను ఆదిరెడ్డి తన సొంత డబ్బులతో గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరత్ అభివృద్ధి పేరిట నగరంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు

News June 13, 2024

కృష్ణా: పలు పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. ఏయే ఫలితాలు విడుదల అయ్యాయంటే.. ☞ ఫార్మ్-డీ 1వ సెమిస్టర్ ☞ LLB కోర్సు 5వ సెమిస్టర్ ☞ బీ ఫార్మసీ 1వ సెమిస్టర్

News June 13, 2024

విశాఖ: పరీక్ష తేదీల్లో మార్పు

image

విశాఖ జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లకు జరగనున్న పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు జరిగినట్లు విశాఖ జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. ఈనెల 20 తేదీన 6,8 తరగతులకు, 21తేదీన 7,9 తరగతులకు మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు జరుగుతుందన్నారు. హాల్ టికెట్లకు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

News June 13, 2024

బైక్‌పై సచివాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర

image

మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్‌లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్‌పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.

News June 13, 2024

నెల్లూరు జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయో..?

image

మెగా DSCపై చంద్రబాబు తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నెల్లూరు జిల్లా నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా పరిధిలో 3,200కు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. HM పోస్టులు 100, SGT పోస్టులు 1500కు పైగా భర్తీ చేయాల్సి ఉంది. తాజాగా 16,347 పోస్టులకు చంద్రబాబు ఓకే చెప్పడంతో నెల్లూరు జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే క్లారిటీ రానుంది.

News June 13, 2024

గంగోత్రిలో గుత్తి వాసి మృతి

image

గుత్తికి చెందిన వ్యాపారస్థుడు శ్రీరామ్ సత్య ఆంజనేయులు(65) కేదార్నాథ్‌లో మృతి చెందాడు. గత నెల 25వ తేదీ సుమారు 40మంది కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి గంగోత్రిలో ఉన్న సమయంలో శ్రీరాం సత్య ఆంజనేయులుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో టూరిస్టులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News June 13, 2024

చిత్తూరు MLAల ఆశలన్నీ వాటిపైనే..!

image

మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతానికి 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులకూ కేబినెట్ హోదా వర్తిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. ఈనేపథ్యంలో ఖాళీగా ఉన్న ఓ బెర్త్‌తో పాటు, దానికి సమానంగా భావించే కేబినెట్ హోదా పదవులపై జిల్లా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి ఏ పదవి వస్తుందో వేచి చూడాలి మరి.

News June 13, 2024

కర్నూలు ఎంపీ MPTCగా రాజీనామా

image

తన MPTC పదవికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి ఆయన అందజేశారు. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి MPTCగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో MPగా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామయ్యపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు MPగా ఉండటంతో MPTC పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

News June 13, 2024

యర్రగొండపాలెం: రూ.5 లక్షల ఎరువులు సీజ్

image

యర్రగొండపాలెం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను దర్శి వ్యవసాయ సంచాలకులు కె. బాలాజీ నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాకును పరిశీలించారు. రైతులు ఎటువంటి విత్తనాలు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేని రూ.5లక్షల విలువగల ఎరువులు సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శేషి రెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

News June 13, 2024

బైక్‌పై సచివాలయానికి వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర

image

మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్‌లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్‌పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.