Andhra Pradesh

News June 13, 2024

జగన్‌ను కలిసిన అనిల్ కుమార్ యాదవ్

image

తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ను నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేట ఎంపీగా ఓడిపోవడానికి గల కారణాలను జగన్‌కు వివరించారు. గెలవకపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని అనిల్‌కు జగన్ పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం అనిల్ కుమార్ జగన్‌తో భేటీ కావడం ఇదే మొదటిసారి.

News June 13, 2024

అనంత: పార్టీ ఏదైనా తగ్గని కురబల ప్రాతినిధ్యం

image

పార్టీ ఏదైనా జిల్లాలో కురుబల ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యే, కురుబ సామాజికవర్గానికి చెందిన శంకర్ నారాయణ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. రెండో పర్యాయంలో అదే వర్గానికి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో సవిత మెుదటిసారి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొంది మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విశేషం.

News June 13, 2024

నంద్యాల: బాలికపై చిరుత పులి దాడి

image

నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండే‌పై చిరుతపులి దాడి చేసిన ఘటన గురువారం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీల కుటుంబాలు, రైల్వే పనులు చేస్తుండగా ఒక్కసారిగా చిరుత బాలికపై దాడి చేసిందని సాటి కూలీలు తెలిపారు. వారందరూ కేకలు వేయడంతో చిరుత పులి అక్కడనుంచి పారిపోయిందన్నారు. గాయపడిన బాలికను రైల్వే అధికారులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News June 13, 2024

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత: విజయనగరం ఎంపీ

image

ఉత్తరాంధ్రకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు ఒక కేంద్రమంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారని తెలిపారు. స్కూల్ బ్యాగ్స్‌పై జగన్ ఫొటో ఉన్నా కూడా పంపిణీకి చంద్రబాబు ఆదేశించడం గొప్ప విషయమని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సామాజిక న్యాయం పాటించి మంత్రి పదవులు ఇచ్చారన్నారు.

News June 13, 2024

విజయవాడలో శ్రీకాకుళం హెడ్ కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య రెడ్డి CM ప్రమాణ స్వీకార బందోబస్త్‌లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేట తరలించారు.

News June 13, 2024

భోగాపురంపై రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు

image

పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి అశోక్ గజపతిరాజు హయాంలో పునాది పడిందని.. గత 5 ఏళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రికార్డు సమయంలో విమానాశ్రయాన్ని పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

News June 13, 2024

అనంత: అరటి తోటలో మృతదేహం లభ్యం

image

నార్పల మండలం పప్పూరు గ్రామంలోని అరటి తోటలో మృతదేహం లభ్యమైంది. మృతుడు బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన రాంమోహన్ రెడ్డిగా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నార్పల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే అప్పులు బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది

News June 13, 2024

తూ.గో: బాలికపై తాత లైంగిక దాడికి యత్నం

image

రంపచోడవరం నియోజకవర్గ పరిధి అడ్డతీగల మండంలోని ఓ గ్రామంలో 6 ఏళ్ల బాలికపై తాత వరసయ్యే చిన్నారెడ్డి అత్యాచారయత్నానికి పాల్పడ్డట్లు ఎస్సై అప్పలరాజు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. బాలిక బుధవారం ఇంటి బయట ఆడుకుంటుంది. ఆమెకు పనసతొనలు ఇస్తానని ఆశచూపి ఇంటి పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పింది. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News June 13, 2024

కర్నూలు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఉద్యోగుల వినతి

image

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ శాఖలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మానవతా దృక్పథంతో కొనసాగించేందుకు కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆ శాఖ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పీ.రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడలో మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామచంద్రరావు తెలిపారు.

News June 13, 2024

జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పదవికి రాజీనామా

image

కోవూరు వైసీపీ నేత, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు పదవికి దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీనామా చేసిన పత్రాన్ని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. రాజీనామాను ఆమోదించాలని కోరారు.