Andhra Pradesh

News June 13, 2024

మార్కాపురం: బావిలో మహిళ మృతదేహం 

image

మార్కాపురం మండలంలోని పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో పాడుబడిన బావిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వెంకటేశ్వర నాయక్ మృతి చెందిన మహిళను యాచకురాలిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

బద్వేలు: ప్రమాదమా.. ఆత్మహత్య?

image

బద్వేలులో గురువారం అగ్ని ప్రమాదంలో <<13432512>>సాయికుమార్ రెడ్డి<<>> మృతి చెందిన విషయం తెలసిందే. అయితే సాయికుమార్ రెడ్డి ప్రేమ విఫలం అవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఘటనపై సీఐ యుగంధర్ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 13, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార డ్యూటీకి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ మృతి

image

విజయవాడలో నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఏ లక్ష్మయ్య రెడ్డి నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార బందోబస్త్‌లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా నేటి ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేటకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

News June 13, 2024

ముగిసిన చంద్రబాబు తిరుమల పర్యటన

image

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరుచానూరుకు వచ్చారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు వీడ్కోలు పలకగా.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

News June 13, 2024

రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

News June 13, 2024

సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

image

రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో మంత్రి సంధ్యారాణి మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. శాఖలు కేటాయించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రిని సూచించారు.

News June 13, 2024

పుంగనూరులో పొట్టేళ్లకు భలే గిరాకీ

image

పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం పొట్టేళ్ల సంత జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేళ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో జత పొట్టేళ్లు ధర రూ. 40 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. పొట్టేళ్ల సంతకు కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. దీంతో సంతలో సందడి నెలకొంది.

News June 13, 2024

కృష్ణా: ఒక్క సంతకంతో 4.78లక్షల మందికి లబ్ధి

image

సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ అనంతరం నేడు పింఛను రూ.4 వేలకు పెంచుతూ.. మూడో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంతకంతో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఉన్న 4,78,736 మందికి జూలై నుంచి పెరిగిన పింఛన్ సొమ్ము అందనుంది. కాగా అధికారిక డాష్‌బోర్డు సమాచారం ప్రకారం జూన్ నాటికి మొత్తంగా కృష్ణా జిల్లాలో 2,42,856, ఎన్టీఆర్ జిల్లాలో 2,35,880 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.

News June 13, 2024

గెలుపోటములు సహజం: వైవీ సుబ్బారెడ్డి

image

ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం విశాఖ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులను అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

మాకు ఉద్యోగ భద్రత కల్పించండి: రామచంద్రరావు 

image

ప్రభుత్వ మద్యం దుకాణం సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. బెవరేజెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రామచంద్రరావు విజయవాడలో గురువారం మంత్రి జనార్దన్‌రెడ్డి,, శ్రీనివాసరావుని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. వైన్ షాప్‌లు ఏ విధంగా పనిచేస్తున్నాయి, జీతభత్యలు ఎవరు చెల్లిస్తున్నారంటూ వాకబు చేశారు. అనంతరం ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని హామీ ఇచ్చారు.