Andhra Pradesh

News June 13, 2024

39 ఏళ్ల తర్వాత ధర్మవరానికి మంత్రి పదవి

image

39 ఏళ్ల తర్వాత ధర్మవరం నియోజకవర్గానికి మంత్రి పదవి దక్కింది. ధర్మవరం అసెంబ్లీ ఏర్పడిన తరువాత ఇద్దరిని మాత్రమే మంత్రి పదవి వరించింది. మూడో వ్యక్తి సత్యకుమార్ యాదవ్. కాంగ్రెస్ నుంచి పీవీ చౌదరి మంత్రిగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1985లో నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి 4 దశాబ్దాల పాటు ధర్మవరాన్ని మంత్రి పదవి ఊరిస్తూ వచ్చింది. తాజాగా సత్యకుమార్ యాదవ్‌కు దక్కింది.

News June 13, 2024

కర్నూలు: గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడి మృతి

image

ఆదోని మండలం ఢనాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. ఆస్పరి మండలం చిన్నహోతూరుకు చెందిన ఈయన 1997లో హాలహర్వి మండలం నిట్రవట్టి ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆలూరు, హోళగుంద మండలాల్లో పనిచేసి ప్రస్తుతం ఢనాపురంలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతికి ఆదోని యూటీఎఫ్ శాఖ నాయకులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

News June 13, 2024

నెల్లూరు: ఆనం, నారాయణకు ఏ శాఖలు దక్కేనో..?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆత్మకూరు నుంచి ఆనం, నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గతంలో ఆనం ఆర్థిక మంత్రిగా, నారాయణ పురపాలక శాఖమంత్రిగా చేశారు. ఇప్పుడు వారికి సీఎం చంద్రబాబు ఏ శాఖలు కేటాయిస్తారన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వారికి ఏ శాఖలు దక్కుతాయో కామెంట్ చేయండి.

News June 13, 2024

ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ ఫలితాల విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి ఫలితాలను పొందవచ్చునని సూచించారు.

News June 13, 2024

VZM: నిబంధనలు పాటించని 104 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను గురువారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 104 మందిపై రూ.25,055 ఈ చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 18 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 13, 2024

ప్రకాశం: మంత్రులకు ఏ శాఖలు దక్కేనో..?

image

మంత్రి వర్గ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ ఎన్నికైన విషయం తెలిసిందే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గొట్టిపాటి, హ్యాట్రిక్ నమోదు చేసిన వీరాంజనేయకు మొదటిసారి మంత్రి పదవులు దక్కాయ. ఇప్పుడు వారికి సీఎం చంద్రబాబు ఏ శాఖలు కేటాయిస్తారన్నది జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వారికి ఏ శాఖలు దక్కుతాయనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 13, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి 6వ సెమిస్టర్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల డిగ్రీ 6వ సెమిస్టర్, సప్లిమెంటరీ (2015-16, 2016-17 అడ్మిట్ బ్యాచ్) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News June 13, 2024

ప.గో: ‘అమాత్యులారా.. మా సమస్యలివిగో..!’

image

ఉమ్మడి ప.గో జిల్లాల్లో ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో ప్రగతిపై ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు, నూజివీడు నుంచి కొలుసు పార్థసారథి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి, డెల్టా ఆధునికీకరణ, ఏటిగట్లు, వైద్య కళాశాల, ఫిషింగ్‌ హార్బర్, ఆక్వా వర్సిటీ, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయో కామెంట్ చేయండి.

News June 13, 2024

సముద్ర స్నానానికి వెళ్లి కృష్ణా జిల్లా వాసి మృతి

image

తాడిగడపకు చెందిన రత్నకుమారి(57)కర్ణాటకలోని మంగళూరు బీచ్‌లో మునిగి మరణించింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు రత్నకుమారి తన 5మంది స్నేహితురాళ్లతో కలిసి వారం క్రితం మైసూరుకు వెళ్లారు. పలు పుణ్యక్షేత్రాలు సందర్శించి మంగళవారం ఉళ్లాల బీచ్‌‌లో స్నానం చేస్తుండగా..భారీ అలలు వారిని సముద్రంలోకి లాక్కువెళ్లాయి. గజ ఈతగాళ్లు వారిని ఒడ్డుకు తీసుకువచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రత్నకుమారి మృతిచెందినట్లు తెలిపారు.

News June 13, 2024

అనంత: టీచర్ పోస్టుల భర్తీ.. 15న ఇంటర్వ్యూ

image

ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకులాల్లో ఖాళీగా ఉండే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డెమో ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్/పార్టమ్ టీచర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15న కురుగుంట అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.