Andhra Pradesh

News June 13, 2024

అనంత: 39 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవి

image

ఉరవకొండ నియోజకవర్గానికి 39 ఏళ్ల తర్వాత మంత్రి పదవి దక్కింది. ఇక్కడి నుంచి గెలిచిన గుర్రం నారాయణప్ప 1985లో మంత్రి అయ్యారు. ఆ తరువాత ఎవరినీ అదృష్టం వరించలేదు. ఇన్నేళ్ల తరువాత టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కింది. 1994లో కేశవ్ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మరో 4సార్లు గెలిచారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వరుసగా ఏడుసార్లు ఆయన పోటీ చేశారు.

News June 13, 2024

గుంటూరు: రైళ్లు రద్దు నిర్ణయం ఉపసంహరణ

image

విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 21వ తేదీ నుంచి, పలు రైళ్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి బుధవారం తెలిపారు. విజయవాడ- గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి- విజయవాడ (07630), రైళ్లు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.

News June 13, 2024

నేడు ఉమ్మడి అనంత జిల్లాలో తెరుచుకోనున్న 5,127 పాఠశాలలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేడు 5,127 పాఠశాలలు వేసవి సెలవులు అనంతరం తెరుచుకోనున్నాయి. అందులో ప్రభుత్వానివి 3,855 పాఠశాలలు కాగా, ప్రైవేట్ పాఠశాలలు 1,272 ఉన్నాయి. మొత్తం 5.88 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు అందాల్సిన విద్యా కానుక కిట్లు మాత్రం పూర్తిస్థాయిలో రాలేదని అధికారులు చెబుతున్నారు.

News June 13, 2024

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: మంత్రి బీసీ

image

ఉమ్మడి జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ‘ఉన్నతాధికారులతో సమావేశమై ఏ ప్రాజెక్టులను ముందుగా చేపడితే మంచిదన్న అంశాలను సమీక్షిస్తా. ఏ ప్రాజెక్టులతో ఎక్కువ మందికి ప్రయోజనం?, ఏవి వేగంగా పూర్తవుతాయి, జిల్లాకు మేలు చేసే ప్రాజెక్టులు ఏమిటి? పెండింగ్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? తదితర విషయాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటా’ అన్నారు.

News June 13, 2024

రాజాం: ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం

image

మొగిలివలస వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన సత్యం, కుమార్ రాజాంలో కూరగాయలు కొని ఆటోలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కుపోయిన వారిని 108లో ఉన్న పనిముట్లతో ఆటోను కట్ చేసి రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News June 13, 2024

నెల్లూరు: 35 ఏళ్ల తర్వాత రెండోసారి

image

ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆనం మొదటిసారి 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవీఎస్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1985లో రాపూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొంది 1989లో దివంగత ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 35 ఏళ్ల తర్వాత రెండోసారి టీడీపీలో మంత్రిగా ఆనం ఎంపిక కావడం విశేషం.

News June 13, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేసే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.

News June 13, 2024

గుంటూరు: నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

image

వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.

News June 13, 2024

30ఏళ్ల తర్వాత ‘పాలకొల్లు’కు మంత్రి పదవి

image

పాలకొల్లు నియోజకవర్గానికి 30 ఏళ్ల తర్వాత మరోసారి మంత్రి పదవి దక్కింది. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హరిరామజోగయ్య మర్రి చెన్నారెడ్డి జట్టులో పౌరసంబంధాలు, అటవీశాఖ మంత్రిగా చేశారు. తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమలు, భూగర్భగనుల శాఖ దక్కింది. ఆ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్నికైనా మంత్రి పదవి దక్కలేదు. తాజాగా హాట్రిక్ వీరుడు రామానాయుడు మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం.

News June 13, 2024

నిబంధనలను పాటించకపోతే రద్దు చేస్తాం: ప్రకాశం డీఈఓ

image

నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. గురువారం నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవడంతో ఆమె ప్రైవేటు పాఠశాలలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు పాఠశాలల తప్పకుండా పాటించాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చే ముందు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు.