Andhra Pradesh

News September 27, 2024

‘దేవర’ అభిమానుల సందడి.. కటౌట్‌కి పాలాభిషేకం

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లిలో ‘దేవర’ అభిమానుల సందడి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్స్‌కు ఆయన ఫ్యాన్స్ గజమాలలు వేసి, పాలాభిషేకం చేశారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రారంభం కానుండగా.. అన్ని థియేటర్లలో రేపు రిలీజ్ కానుంది. అనంతరం టపాసులు పేల్చుతూ ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ మూవీలోని పాటలకు డాన్సులు వేశారు.

News September 27, 2024

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ

image

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ గురువారం ఏవో ఛాంబర్‌లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గతంలో సీ.బెళగల్ మండలంలో తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయశ్రీ సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిపాలన అధికారిగా పనిచేసిన రాజేశ్వరి కలెక్టరేట్ రెవెన్యూ సెక్షన్‌లోనే నియమితులయ్యారు.

News September 26, 2024

నంద్యాల సబ్ డివిజన్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని పోలీసులకు ఎస్పీ పిలుపునిచ్చారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా మట్కా, గ్యాంబ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

News September 26, 2024

కృష్ణా: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

image

కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు వాహనదారులను హెచ్చరించారు.

News September 26, 2024

కృష్ణా: ‘అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు’

image

కృష్ణా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

News September 26, 2024

తూ.గో: 4వరోజు గాలింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

image

ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఏజెన్సీలోని జలపాతం వద్ద నాలుగు రోజుల కింద గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికి తెలియరాలేదు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారుల సమక్షంలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఏజెన్సీని జల్లెడపట్టారు. అయినా హరదీప్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనలో ఉన్నారు.

News September 26, 2024

పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

image

జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

News September 26, 2024

పోలీసులకు కర్నూలు డీఐజీ కీలక ఆదేశాలు

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ జీ.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ అల్లరి మూకలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబరీ, డెకాయిటి వంటి కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు.

News September 26, 2024

వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సురేశ్

image

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలకు పూర్తి అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లను గురువారం ప్రకటించారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

image

మాజీ MP మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ హాజరై నివాళులర్పించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు బ్యాండ్‌తో గాల్లోకి 3రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో MLAలు సోమిరెడ్డి, దామచర్ల జనార్ధన్, నేతలు, పెద్దఎత్తున మాగుంట అభిమానులు పాల్గొన్నారు.