Andhra Pradesh

News June 13, 2024

పెనుకొండ: మంత్రిని ఓడించి మంత్రి అయ్యారు

image

పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటి చేసి సవిత ఘన విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ తరుపున పోటీ చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీ చరణ్‌ను ఓడించి అత్యధిక మెజారిటితో గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు, ఘనంగా సన్మానించారు.

News June 13, 2024

కర్నూలు: చంద్రబాబు సమీక్షలో జిల్లా మంత్రులు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, NMD ఫరూఖ్, టీజీ భరత్ పాల్గొన్నారు. కాగా రేపటిలోగా నూతన మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ శాఖ వరిస్తుందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

News June 13, 2024

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఏ శాఖ?

image

రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవి ప్రకటించింది. ప్రస్తుతం ఆయనకు మంత్రి మండలిలో ఏ శాఖ వరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఈయనకు సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. మరి కొంతమంది ఈయనకు కార్మిక శాఖ ఇస్తారని అంచనాలు వేస్తున్నారు. మరి మండిపల్లికి ఏ శాఖ వరిస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News June 13, 2024

యర్రగొండపాలెం: బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా

image

యర్రగొండపాలెంకు చెందిన రాష్ట్ర బీసీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోలెబోయిన రామారావు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి రాజీనామా లేఖను పంపినట్లు బుధవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, మాజీ సీఎం జగన్‌, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ వెంట నడుస్తామని స్పష్టం చేశారు.

News June 13, 2024

శ్రీకాకుళం: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ(2013- 14 బ్యాచ్, 2021- 22 తర్వాతి బ్యాచ్‌లు) పరీక్షల టైంటేబుల్‌ విడుదలైంది. జూలై 6, 8, 9, 10,11 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News June 13, 2024

మంత్రి నారాయణను కలిసిన మాజీ మంత్రి పరసా

image

నూతన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరసా రత్నం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు

News June 13, 2024

తూ.గో: పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపించండి

image

భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డ్స్‌కు ప్రతిపాదనలు కోరుతున్నామని కాకినాడ సెట్రాజ్ అధికారులు బుధవారం తెలిపారు. కలలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యరంగం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, పౌర సేవలు, వృత్తి, పరిశ్రమ వంటి రంగాల్లో ..అత్యున్నతమైన ప్రతిభ కనబరిచిన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

News June 13, 2024

చంద్రబాబును కలిసిన కలెక్టర్ వేణుగోపాల్

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌తోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 13, 2024

మంత్రివర్గంలో ఎన్టీఆర్ జిల్లాకు దక్కని ప్రాధాన్యత

image

ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. బొండా ఉమా, గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాస్‌తో పాటు బీజేపీ నుంచి గెలిచిన సుజనా చౌదరి పేర్లు సైతం తొలుత ఆశావాహుల జాబితాలో వినిపించాయి. కాగా చంద్రబాబు తన మంత్రివర్గంలో ఒక స్థానాన్ని నేడు ఎవరికీ కేటాయించకుండా ఉంచారని, అది ఎన్టీఆర్ జిల్లా నేతలకు దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

News June 13, 2024

భీమవరం: ఫ్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయాడు

image

టౌన్ రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్లే పాసింజర్ ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ను బద్దలు కొట్టి అతడిని రక్షించారు. ఆ వ్యక్తికి ఏమి కాకపోవడంతో రైల్వే సిబ్బంది ప్రయాణకులు అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.